రాజధాని కేసుల వాదనకు ముకుల్ రోహత్గీకి రూ.5 కోట్లు!

| Edited By: Srinu

Jan 23, 2020 | 4:51 PM

అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని అమరావతిని విభజిస్తూ మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైకోర్టులో రాజధాని అంశంపై దాఖలైన కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించింది. ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడు రాజధానుల క్రమంలో.. అమరావతి […]

రాజధాని కేసుల వాదనకు ముకుల్ రోహత్గీకి రూ.5 కోట్లు!
Follow us on

అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని అమరావతిని విభజిస్తూ మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైకోర్టులో రాజధాని అంశంపై దాఖలైన కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించింది. ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మూడు రాజధానుల క్రమంలో.. అమరావతి పరిసరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులతో పాటు టీడీపీ, అమరావతి జేఏసీ కూడా అమరావతిని కొనసాగించాలని నిరసన వ్యక్తం చేస్తోంది. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు, మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ తదితర అంశాలపై నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం తరఫున రోహత్గీని నియమించారు. ఇకపై ఆయా కేసులను రోహత్గీ వాదించనున్నారు.