ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 3,648కి.మీ ఈ నేల మీద నడిచినందుకు.. గత 9 సంవత్సరాలుగా ఒకడిగా మీలో నిలిచినందుకు.. ఆకాశమంతటి విజయం అందించిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన చెప్పారు. పాదయాత్రలో మీ అందరి బాధలు విన్నాను.. మీకు నేను ఉన్నాను అంటూ యాత్ర సినిమాలోని డైలాగ్‌ను చెప్పి ఉత్సాహపరిచారు వైఎస్ జగన్.