రంజాన్‌ మాసం ప్రారంభం : జగన్‌ శుభాకాంక్షలు

|

May 06, 2019 | 8:50 PM

హైదరాబాద్‌ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైసీపీ అధినేత జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య పవిత్ర మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకుంటారని, వారికి అల్లా దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు. మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని […]

రంజాన్‌ మాసం ప్రారంభం : జగన్‌ శుభాకాంక్షలు
Follow us on

హైదరాబాద్‌ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైసీపీ అధినేత జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య పవిత్ర మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకుంటారని, వారికి అల్లా దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు.

మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని పేర్కొన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని ఆయన అన్నారు.