వైసీపీ నూతన రాజ్యసభ ఎంపీలకు జగన్ అభినందనలు

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ పార్టీ నుంచి బరిలోకి దిగిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని నలుగురు

వైసీపీ నూతన రాజ్యసభ ఎంపీలకు జగన్ అభినందనలు

Edited By:

Updated on: Jun 19, 2020 | 10:00 PM

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ పార్టీ నుంచి బరిలోకి దిగిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని నలుగురు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వారికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జగన్.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను వినిపించడానికి వారితో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎంపీలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కి కృతఙ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన విధంగా సాయం చేస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఆ తరువాత వారు సీఎం జగన్‌ని కలిశారు.

Read This Story Also: అప్పటివరకు సుశాంత్ ఫ్లాట్‌లోనే ఉన్నా.. సంచలన విషయాలు వెల్లడించిన రియా