గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామంటూ… గ్యాంగ్ రేప్

రాజస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. ప్రధాన మంత్రి స్కీమ్ కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని నమ్మించి 25 ఏళ్ల వివాహితపై అత్యంత పైశాచికంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన చేసిన ఈ సంఘటన జైపూర్ సిటీకి సమీపంలో వెలుగుచూసింది. నాగౌర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళ గ్యాస్ కనెక్షన్ కోసం ప్రయత్నిస్తోంది. మార్చి నెలలో గ్యాస్ కనెక్షన్ కోరుతూ దరఖాస్తు ఇచ్చేందుకు ఓ ఏజెన్సీకి […]

గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామంటూ... గ్యాంగ్ రేప్

Updated on: May 10, 2019 | 4:49 PM

రాజస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. ప్రధాన మంత్రి స్కీమ్ కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని నమ్మించి 25 ఏళ్ల వివాహితపై అత్యంత పైశాచికంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన చేసిన ఈ సంఘటన జైపూర్ సిటీకి సమీపంలో వెలుగుచూసింది. నాగౌర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళ గ్యాస్ కనెక్షన్ కోసం ప్రయత్నిస్తోంది. మార్చి నెలలో గ్యాస్ కనెక్షన్ కోరుతూ దరఖాస్తు ఇచ్చేందుకు ఓ ఏజెన్సీకి వెళ్లింది. అక్కడ పనిచేసే ముఖేశ్ కుమార్ ధీరూ అనే వ్యక్తి, ఆమెను బాగా గుర్తుపెట్టుకున్నాడు. రెండు నెలల తర్వాత మే 7న ఆమె ఇంటికి వచ్చిన ముఖేశ్, తనతో వస్తే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని చెప్పాడు. గ్యాస్ కనెక్షన్ కోసం కుచమాన్ సిటీలో వేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి, ఆమెను నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, తన స్నేహితుడితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. అత్యాచారం చేస్తున్న సమయంలో మొబైల్‌లో వీడియో తీసి, స్పృహ వచ్చిన తర్వాత ఆమెకు చూపించి బ్లాక్‌మెయిల్ చేశారు. తాము పిలిచినప్పుడల్లా రావాలని, తాము చెప్పినట్టు వినాలంటూ కండీషన్లు పెట్టారు.

భయపడుతూ  స్వగ్రామానికి చేరుకున్న మహిళ 10 రోజుల పాటు మనసులోనే బాధను భరించింది. ముకేష్ మళ్లీ వచ్చి లైంగిక వాంఛ తీర్చాలని బెదిరిస్తుండటంతో..మహిళ విషయాన్ని తన భర్తకు తెలిపింది. ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు… ముఖేశ్‌ను అరెస్ట్ చేసి అతని మొబైల్‌ను స్వాదీనం చేసుకున్నారు. అతని  స్నేహితుడి కిశోర్ కోసం గాలిస్తున్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతంలో ఆధారాల కోసం వెతికిన పోలీసులు… వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి పంపించారు.