జగిత్యాల జిల్లాలో జరిగిన భారతీయ జనతాపార్టీ ర్యాలీలో కొందరు యువకులు తల్వార్లతో రెచ్చిపోయారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జగిత్యాల జిల్లా పర్యటనలో యువకులు తల్వార్లతో హల్‌చల్ చేశారు. జిల్లాలోని రాయికల్ మండలం అల్లిపూర్‌లో ఎంపీ అర్వింద్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా కొంత మంది యువకులు తల్వార్లతో నృత్యాలు చేస్తూ హంగామా సృష్టించారు. అయితే, కత్తులతో బహిరంగంగా ప్రదర్శన చేసిన ఏడుగురిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.