22 ఏళ్లకే ఐపీఎస్… ఆల్ ఇండియా రికార్డ్!

| Edited By:

Dec 15, 2019 | 12:00 AM

గుజరాత్ కు చెందిన 22 ఏళ్ల హసన్ సఫిన్ దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఐపిఎస్ అధికారిగా రికార్డు సృష్టించనున్నాడు. హసన్ డిసెంబర్ 23 న జామ్ నగర్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సఫిన్ పాలన్పూర్ లోని కనోదర్ గ్రామానికి చెందినవాడు. గత ఏడాది సఫిన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు పొంది, ఐపిఎస్ ఆఫీసర్ కావడానికి అర్హత సాధించాడు. ఈ అవకాశాన్ని నా దేశానికి సేవ […]

22 ఏళ్లకే ఐపీఎస్... ఆల్ ఇండియా రికార్డ్!
Follow us on

గుజరాత్ కు చెందిన 22 ఏళ్ల హసన్ సఫిన్ దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఐపిఎస్ అధికారిగా రికార్డు సృష్టించనున్నాడు. హసన్ డిసెంబర్ 23 న జామ్ నగర్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సఫిన్ పాలన్పూర్ లోని కనోదర్ గ్రామానికి చెందినవాడు. గత ఏడాది సఫిన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు పొంది, ఐపిఎస్ ఆఫీసర్ కావడానికి అర్హత సాధించాడు. ఈ అవకాశాన్ని నా దేశానికి సేవ చేయడానికి ఉపయోగిస్తాను అని హాసన్ తెలిపారు.

హసన్ తల్లిదండ్రులు ముస్తఫా హసన్, నసీంబా. వీరిద్దరూ ఒక చిన్న వజ్రాల యూనిట్‌లో కార్మికులుగా పనిచేస్తున్నారు. హసన్ తన చదువు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. కుటుంబం యొక్క కొద్దిపాటి ఆదాయాలు అతని చదువుకు సరిపోవు. తమ కుమారుడి ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడానికి, అదనపు డబ్బు సంపాదించడానికి వారు స్థానిక రెస్టారెంట్లలో పని చేసారు. నా కలను కొనసాగించడానికి కొందరు వ్యాపారవేత్తలు ఆర్థికసాయం చేశారని హాసన్ తెలిపారు.