Watch: నది ఒడ్డున సరదాగా ఊయల ఊగుతుండగా.. ఫైథాన్ మాస్ ఏంట్రీ.. ట్విస్ట్ అదిరింది!
అడవిలోని నదీ తీరంలో సరదాగా గడపాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని ప్రమాదం ఎదురైంది. చెట్టుకు కట్టిన తాడుతో సరదాగా ఊగుతున్న సమయంలో భారీ కొండచిలువ ఒక్కసారిగా అతడి వైపు దూసుకురావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అడవిలోని నదీ తీరంలో సరదాగా గడపాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని ప్రమాదం ఎదురైంది. చెట్టుకు కట్టిన తాడుతో సరదాగా ఊగుతున్న సమయంలో భారీ కొండచిలువ ఒక్కసారిగా అతడి వైపు దూసుకురావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. అడవిలోని ఓ నది తీరంలో కొందరు వ్యక్తులు సరదాగా గడుపుతూ కనిపించారు. వారిలో ఓ వ్యక్తి చెట్టుకు కట్టిన తాడును పట్టుకుని నది వైపు ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అతడు తాడుపై ఊగుతున్న సమయంలో అంతా సాధారణంగానే కనిపించింది. అయితే ఒక్కసారిగా సమీపంలోని అడవి ప్రాంతం నుంచి భారీ కొండచిలువ బయటకు వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది.
కొండచిలువ వేగంగా ఆ వ్యక్తి వైపు కదలడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నదిలోకి దూకి తప్పించుకున్నాడు. అనంతరం అతడు తన సహచరులతో కలిసి ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనను అక్కడున్న వారు వీడియోగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్ కావడంతో వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నదీ తీరాలు, అడవి ప్రాంతాల్లో సరదా కోసం చేసే సాహసాలు ఎప్పుడైనా ప్రమాదకరంగా మారవచ్చని పలువురు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ వీడియోకు సంబంధించిన ప్రదేశం, ఘటన జరిగిన తేదీ, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల వివరాలు స్వతంత్రంగా ధృవీకరించడంలేదు. ఏఐ వీడియో కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.. అందువల్ల వైరల్ వీడియోను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా.. ఆ వ్యక్తి అప్రమత్తంగా స్పందించి ప్రమాదం నుంచి బయటపడటం అదృష్టంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
जंगल में नदी के किनारे पर, एक आदमी रस्सी के सहारे झूला झूल रहा था।
तभी अचानक एक विशालकाय साँप ने उस व्यक्ति पर हमला करने की कोशिश की।
लेकिन किस्मत अच्छी थी कि वो आदमी बच गया और नदी में कूद गया, फिर जैसे तैसे उसने व उसके साथियों ने नदी में से भागकर अपना जान बचाया..😱 pic.twitter.com/F1QyMZ6uhH
— Sanjay Gupta 🇮🇳 (@sanjukgupta1987) August 20, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
