Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డి అండ్ డి’ కోసం హీరోయిన్ ను వెతుకుతున్న శ్రీను వైట్ల .. చివరకు అమ్మడిని ఫిక్స్ చేశారా..?

హీరో విష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిగా ఉన్నాడు. ఇప్పటికే 'మోసగాళ్లు' సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కాజల్ నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కనిపించనున్నారు...

'డి అండ్ డి' కోసం హీరోయిన్ ను వెతుకుతున్న శ్రీను వైట్ల .. చివరకు అమ్మడిని ఫిక్స్ చేశారా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2020 | 2:10 PM

హీరో విష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిగా ఉన్నాడు. ఇప్పటికే ‘మోసగాళ్లు’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు చెల్లెలుగా స్టార్ హీరోయిన్ కాజల్ నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత తన కెరియర్ లో ఢీ లాంటి సాలిడ్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘డి అండ్ డి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ‘ఢీ’ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.

అవరమ్ భక్త మంచు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఢీ సినిమాను మించి కామెడీ, యాక్షన్ ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ఈ సినిమా లో విష్ణుకు జోడీగా నటించే హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఇప్పటికే పలువురు భామల పేర్లు వినిపించాయి. ఈ మూవీకోసం యంగ్ బ్యూటీలను గాలిస్తున్నారట. నాని నటించిన ‘మజ్ను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆతర్వాత ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ని తీసుకునే అవకాశం కూడా ఉందని టాక్ నడిచింది. ఇక సూపర్ ఫామ్ లో ఉన్నరష్మిక అయితే సినిమాకు సరిగ్గా సరిపోతుందని, ఆమెను సంప్రదిస్తున్నారని కూడా గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు మరో బ్యూటీ పేరు వినిపిస్తుంది. హిరోషిని కోమలి ని హీరోయిన్ గా తీసుకుంటున్నారని ఫిలింనగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కుర్రది పలు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. గతేడాది కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. మరి విష్ణుకు జోడీగా ఈ అమ్మడిని ఎంపిక చేశారా లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకువేచి చూడాల్సిందే..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్