ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ‘జగనన్న తోడు’ రుణాలకు స్టాంపు డ్యూటీ మినహాయింపు
'జగనన్న తోడు' పథకం ద్వారా రుణం పొందే లబ్ధిదారులకు స్టాంపు డ్యూటీని మినహాయిస్తున్నట్టు జగన్ సర్కార్ ప్రకటించింది. లోన్ మంజూరు చేసేందుకు బ్యాంకులు...
‘జగనన్న తోడు’ పథకం ద్వారా రుణం పొందే లబ్ధిదారులకు స్టాంపు డ్యూటీని మినహాయిస్తున్నట్టు జగన్ సర్కార్ ప్రకటించింది. లోన్ మంజూరు చేసేందుకు బ్యాంకులు వసూలు చేసే డాక్యుమెంటేషన్ స్టాంపు డ్యూటీ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పది లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని.. గ్రామ, వార్డు సచివాలయ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు. రుణం తీసుకునేవారు ఒక్కొక్కరికి రూ.324 చొప్పున.. మొత్తంగా రూ. 32 కోట్లు ప్రభుత్వం భరిస్తుందని ఆయన వెల్లడించారు.
అసంఘటిత రంగంలోని చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ జగనన్న తోడు రుణాలను ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారులు, కూరగాయలు, వస్తువులు అమ్మేవారు, తోపుడు బండ్లపై విక్రయాలు జరిపేవారు, ఇత్తడి పాత్రల తయారీదారులు, టిఫిన్ సెంటర్లు, కలంకారీ పనులు చేసే వారికి.. ఇలా వివిధ రంగాల్లోని వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. మొదటి దశలో భాగంగా దాదాపు 10 లక్షలమందికి రూ.1,000 కోట్ల రుణాలు మంజూరు చేశారు. వీటికి ప్రతి సంవత్సరం రూ.60 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు అయ్యే ఇంట్రస్ట్‌ని గవర్నమెంటే చెల్లిస్తుంది. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 10 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో వారం, పది రోజుల్లో డబ్బులు జమ కానున్నాయి. రుణాలు తీసుకున్న వారు గుర్తింపు కార్డులు తీసుకొని, ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. ఈ లోన్స్ గడువులోగా చెల్లిస్తే మళ్లీ వడ్డీ లేకుండా రుణాలు తీసుకోవచ్చు.
Also Read :
నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం
ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు