ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ 5 పండ్లను తినకండి.. డేంజర్‌లో పడతారు జాగ్రత్త

|

Jan 08, 2025 | 6:36 PM

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం చాలా మంచిది.. వాస్తవానికి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు పండ్లల్లో పుష్కలంగా ఉంటాయి.. అయితే.. కొన్ని పండ్లు ఉదయాన్నే పరగడుపున తినడం ఆరోగ్యానికి హానికరమని డైటీషియన్లు చెబుతున్నారు. ఆ పండ్లు ఏంటో తెలుసుకోండి..

1 / 6
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు.. బదులుగా హాని కలుగుతుందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపునొప్పి, అసిడిటీ, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. కొన్ని పండ్లలో ఉండే మూలకాలు ఖాళీ కడుపుతో మన శరీరానికి హాని కలిగిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖాళీ కడుపుతో తినకూడని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 6
అరటిపండు: అరటిపండు మంచి శక్తి వనరు.. అయినప్పటికీ, ఖాళీ కడుపుతో తినకుండా ఉండాలి. అరటిపండులో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది.. ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో మెగ్నీషియం, కాల్షియం అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

3 / 6
ఆరెంజ్: ఆరెంజ్.. అందరూ అత్యంత ఇష్టపడే సిట్రస్ పండు.. కానీ ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఆరెంజ్‌లో ఉండే యాసిడ్ ఖాళీ కడుపుతో మన జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది.

4 / 6
జామపండు: జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. ఇది జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు. కానీ ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.

5 / 6
లిచిపండు: లిచీలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది.. ఇది ఖాళీ కడుపుతో ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత, అలసట ఏర్పడుతుంది.

6 / 6
మామిడిపండు: మామిడిపండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది కాకుండా, ఖాళీ కడుపుతో మామిడిని తినడం వల్ల కడుపులో భారం, గ్యాస్ ఏర్పడుతుంది. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)