MP Vijayasai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి

MP Vijayasai Reddy: రామతీర్థం ఘటన మొదలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. నేతల మధ్య విరామం లేకుండా విమర్శల పర్వం సాగుతోంది.

MP Vijayasai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి

Updated on: Jan 17, 2021 | 3:26 PM

MP Vijayasai Reddy: రామతీర్థం ఘటన మొదలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. నేతల మధ్య విరామం లేకుండా విమర్శల పర్వం సాగుతోంది. ముఖ్యంగా భోగి పండుగ వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వ జీవోలను భోగి మంటల్లో వెయడం మొదలు.. ఆయనపై అధికార పక్షం నేతలు విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండు అడుగులు ముందే ఉన్నారని చెప్పాలి. ఛాన్స్ దొరికితే చాలు.. చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారయన. తాజాగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తీరును ఎండగట్టారు. అధికారంలో లేనప్పుడు విధ్వేషాలు రెచ్చగొట్టడం చంద్రబాబుకు అలవాటేనని దుయ్యబట్టారు. గతంలో బంద్‌లు, నిరసనలకు పిలుపు ఇచ్చినప్పుడల్లా ఎన్ని బస్సులు తగలబెట్టాలో జిల్లాల వారీగా టార్గెట్లు ఇచ్చే వారని ఆయన సొంత మనుషులే బయటపెట్టారని విజయసాయిరెడ్డి ఉటంకించారు. ఇప్పుడు కూడా ‘ఆపరేషన్ టెంపుల్స్ డిమాలిషన్’ పేరుతో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కానీ, పోలీసుల విచారణలో టీడీపీ నీచ రాజకీయం బట్టబయలు అయ్యిందని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

అంతకుముందు కూడా ఆయన చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కనుమనాడు రాష్ట్రంలో దాదాపు 3 వేల ఆలయాల్లో సంప్రదాయబద్దంగా గోపూజ జరిగిందని పేర్కొన్నారు. కానీ, ఆవులు, దేవాలయాలతో నీచ రాజకీయాలు చేయడం నాయుడు బాబుకు, పచ్చనేతలకు మాత్రమే తెలిసిన విద్య అని విమర్శించారు. విగ్రహాలు పగలగొట్టి ఆపైన రాబందుల్లా వాలిపోయి రాజకీయం చేయడం ఏం పద్ధతి అని టీడీపీ నేతలను విజయసాయి ప్రశ్నించారు. ఏపీలో మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, వర్గ వైషమ్యాలు రగల్చడమే వారిపని అని విరుచుకుపడ్డారు.

Also read:

Corona Vaccination Live Updates: దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ – 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ, తెలుగు రాష్ట్రాల్లో జోరుగా టీకా పంపిణీ

Prabhas Movie Update: ప్రభాస్ మూవీ షూటింగ్ అప్‏డేట్.. ఆసక్తికర విషయం పంచుకున్న బుట్టబొమ్మ..