AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ముందే తెలుసు : వైసీపీ నేత సజ్జల

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమయిందో తెలియదు కానీ పోలింగ్ కు ఒకరోజు ముందే హైడ్రామాకు తెరలేపారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుందనీ, టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ సర్వే అందిందని సజ్జల అన్నారు. దీంతో దాన్ని అడ్డుకునేందుకు, ప్రజలనుంచి సానుభూతి పొందేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహం […]

టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ముందే తెలుసు : వైసీపీ నేత సజ్జల
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 13, 2019 | 1:35 PM

Share

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుకు ఏమయిందో తెలియదు కానీ పోలింగ్ కు ఒకరోజు ముందే హైడ్రామాకు తెరలేపారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుందనీ, టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ సర్వే అందిందని సజ్జల అన్నారు. దీంతో దాన్ని అడ్డుకునేందుకు, ప్రజలనుంచి సానుభూతి పొందేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు కూర్చోవాలనీ, ఆ తర్వాత తనను తీసుకెళ్లాలని పోలీసులకు చంద్రబాబు సూచించారని ఆరోపించారు.

2014లో జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అందరూ నమ్మారని వ్యాఖ్యానించారు. కానీ ఓటర్ తీర్పు వ్యతిరేకంగా వచ్చిందనీ, అప్పుడు జగన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. ఫలితాలు వచ్చిన 10 నిమిషాలకే మీడియా ముందుకు వచ్చి ప్రజాతీర్పును స్వీకరిస్తున్నామని జగన్  చెప్పారన్నారు. ఓ పరిణితి చెందిన రాజకీయ నాయకుడి లక్షణం అదేనన్నారు. కానీ చంద్రబాబు తీరు అందుకు విరుద్ధంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Follow Us
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్లాస్ ప్లేయర్..!
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన క్లాస్ ప్లేయర్..!
సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..!
సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..!
రోడ్డు ప్రమాద పరిహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
రోడ్డు ప్రమాద పరిహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఆ బౌలర్ అంటే బుడ్డోడికి తెగ భయం.. చూస్తేనే సుస్సుపడిపోద్ది
ఆ బౌలర్ అంటే బుడ్డోడికి తెగ భయం.. చూస్తేనే సుస్సుపడిపోద్ది
మీ ఆత్మీయ మిత్రులకు పంపేందుకు కోట్స్, బెస్ట్ తెలుగు విషెస్
మీ ఆత్మీయ మిత్రులకు పంపేందుకు కోట్స్, బెస్ట్ తెలుగు విషెస్
యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు..!
యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు..!
ఒడిదుడుకులను తట్టుకోవడానికి హైబ్రిడ్ ఇటిఎఫ్‌లు ఎలా ఉపయోగపడతాయి?
ఒడిదుడుకులను తట్టుకోవడానికి హైబ్రిడ్ ఇటిఎఫ్‌లు ఎలా ఉపయోగపడతాయి?
టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై
టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై
సైలెంట్ కిల్లర్స్..మీ మెదడును దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు!
సైలెంట్ కిల్లర్స్..మీ మెదడును దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు!
పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. తింటే యవ్వనం రివర్స్
పాలు, పండ్లు కన్నా 5 రెట్లు ఎక్కువ.. తింటే యవ్వనం రివర్స్