ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం

| Edited By:

Jun 25, 2020 | 5:13 PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా వైసీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా..

ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం
Follow us on

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా వైసీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా.. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి డొక్కా నామినేషన్ దాఖలు చేయడం, ఈ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండటం.. నామినేషన్ దాఖలకు ఇవాళే చివరి రోజు కావడంతో డొక్కా ఎన్నికను ఏకగ్రీవం చేశారు. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ.. జగన్ తనకు మంచి అవకాశం ఇచ్చారని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

Read This Story Also: సుశాంత్‌ చివరి మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్