రైతులకు న్యాయం చేయండి : యనమల

|

Oct 04, 2020 | 3:26 PM

కాకినాడ సెజ్ కొనుగోళ్ల బినామీ లావాదేవీలపై సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని టీడీపీ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కోరారు.  ‘రూ. 2,610 కోట్ల లావాదేవీల్లో రైతుల వాటాగా రూ 1,000 కోట్లు ఇప్పించడంలో అభ్యంతరం ఏమిటి..?’ అన్నారు. ‘ఎకరానికి రూ. 10 లక్షల చొప్పున 10 వేల ఎకరాల రైతులకు అదనపు పరిహారం కింద రూ 1,000 కోట్లు ఇప్పించాలి’. అని ఆయన డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ కాకినాడ ప్రాంతంలో ఏర్పాటు […]

రైతులకు న్యాయం చేయండి : యనమల
Yanamala Rama Krishnudu
Follow us on

కాకినాడ సెజ్ కొనుగోళ్ల బినామీ లావాదేవీలపై సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని టీడీపీ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కోరారు.  ‘రూ. 2,610 కోట్ల లావాదేవీల్లో రైతుల వాటాగా రూ 1,000 కోట్లు ఇప్పించడంలో అభ్యంతరం ఏమిటి..?’ అన్నారు. ‘ఎకరానికి రూ. 10 లక్షల చొప్పున 10 వేల ఎకరాల రైతులకు అదనపు పరిహారం కింద రూ 1,000 కోట్లు ఇప్పించాలి’. అని ఆయన డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమ కాకినాడ ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై స్థానికుల్లో వ్యతిరేకత ఉందన్న యనమల.. దీని కారణంగా కాలుష్య సమస్యతో పాటు మత్స్యకారులనేక మంది జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

కాకినాడ ప్రాంత హేచరీస్ పై ఆధారపడిన అనేకమంది సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఉపాధికి కూడా బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుతో గండిపడనుందని చెప్పారు. అరబిందో ఇన్ ఫ్రా ఆదాయంలో స్థానికులకు వాటా ఇవ్వాలని ఆయన అడిగారు. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని కోరిన ఆయన.. జగన్ రెడ్డి మౌనంగా ఉండటమే ఈ బినామీ లావాదేవీలకు తార్కాణమని పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి ఈ బినామీ లావాదేవీలపై కొత్త బినామీ చట్టం ప్రకారం దర్యాప్తు జరపాలని కోరుతున్నామన్నారు. వీటన్నింటిపై త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నామని యనమల తెలియజేశారు.