Yamaha Scooter: స్పోర్టీ లుక్‍లో కేకపెట్టిస్తున్న యమహా కొత్త స్కూటర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అంతే..

| Edited By: Shaik Madar Saheb

Apr 09, 2023 | 8:50 AM

కొత్త బైక్ ని యమహా కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది. 2023 యమహా ఏరోక్స్ 155 పేరుతో దీనిని విడుదల చేసింది.. అత్యాధునిక ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్(టీసీఎస్) తో దీనిని తీసుకొచ్చింది. మంచి స్పోర్ట్స్ లో లుక్ అదరగొడుతున్న స్కూటర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Yamaha Scooter: స్పోర్టీ లుక్‍లో కేకపెట్టిస్తున్న యమహా కొత్త స్కూటర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అంతే..
Yamaha Aerox Traction Control
Follow us on

యమహా అంటేనే యూత్ లో అదే రకమైన క్రేజ్. ఒకప్పుడు యమహా ఆర్ఎక్స్ 100 సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. దాని తర్వాత వచ్చిన బైక్ లలో ఆర్ 15 కూడా అదే రేంజ్ లో విజయవంతం అయ్యింది. ఈ క్రమంలో మరో కొత్త బైక్ ని యమహా కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది. 2023 యమహా ఏరోక్స్ 155 పేరుతో దీనిని విడుదల చేసింది.  అత్యాధునిక ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్(టీసీఎస్) తో దీనిని తీసుకొచ్చింది. మంచి స్పోర్ట్స్ లో లుక్ అదరగొడుతున్న స్కూటర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లుక్, అండ్ డిజైన్.. యమహా ఏరోక్స్ 155 స్పోర్టీ డిజైన్‌లో సరికొత్తగా కనిపిస్తోంది. ఫ్రంట్ ఆప్రాన్‌పై అమర్చిన స్ప్లిట్ హెడ్‌లైట్, హ్యాండిల్‌బార్‌పై చిన్న వైజర్‌, షార్ప్ బాడీ వర్క్‌తో స్కూటర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మెటాలిక్ బ్లాక్, డార్క్ మ్యాట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

సామర్థ్యం.. యమహా ఏరోక్స్ 155 స్కూటర్.. 155cc బ్లూ కోర్ లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌తో వస్తుంది.  సీవీటీ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ కు కలిగి ఉంది. ఇది 8,000 ఆర్పీఎం వద్ద 15 బీహెచ్పీ పవర్‌ను, 6,500 ఆర్పీఎం వద్ద 13.9 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఓబీడీ-2 కంప్లైంట్ ఇంజిన్, ఇప్పుడు ఈ20 ఫ్యుయెల్‌తో కూడా నడుస్తుంది. యమహా వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (వీవీఏ) టెక్నాలజీ, సీవీటీ గేర్‌బాక్స్‌తో ఈ వెహికల్ బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు.. హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్‌లో 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, 140-సెక్షన్ రియర్ టైర్, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్ అబ్జార్బర్స్ సరికొత్తగా కనిపిస్తున్నాయి. మొబైల్ డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి ముందు భాగంలో పవర్ సాకెట్, మల్టీ-ఫంక్షన్ కీ, ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ లిడ్, 24.5 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్.. వంటి స్పెసిఫికేషన్స్‌తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.

బ్రేకింగ్.. యమహా ఏరోక్స్ 155 టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్విన్ స్ప్రింగ్-లోడెడ్ షాక్ అబ్జార్బర్స్‌తో వస్తుంది. స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది.

ధర ఎంతంటే.. ఈ కొత్త యమహా స్కూటర్ ధర రూ.1.43 లక్షల (ఎక్స్-షోరూమ్‌) గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..