Worshipped Godse: నాథూరామ్ గాడ్సే అభిమానికి కాంగ్రెస్ ‘అందలం’, పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్.

| Edited By: Pardhasaradhi Peri

Feb 25, 2021 | 6:20 PM

మహాత్మా గాంధీ కిల్లర్ నాథూరామ్ గాడ్సే ని అభిమానించిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఆదరంగా చేర్చుకుంది. మధ్యప్రదేశ్ లో బాబూలాల్ చౌరాసియా..

Worshipped Godse: నాథూరామ్ గాడ్సే అభిమానికి కాంగ్రెస్ అందలం, పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్.
Follow us on

మహాత్మా గాంధీ కిల్లర్ నాథూరామ్ గాడ్సే ని అభిమానించిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఆదరంగా చేర్చుకుంది. మధ్యప్రదేశ్ లో బాబూలాల్ చౌరాసియా అనే ఈ వ్యక్తి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కూడా.. రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్షుడు, మాజీ సీఎం కమల్ నాథ్ సమక్షంలో ఈయన కాంగ్రెస్ లో చేరారు. ఈయనకు కమల్ నాథ్ పుష్ప గుచ్ఛం సమర్పిశ్చి ఆర్భాటంగా వెల్ కమ్ చెప్పిన ఫోటోను రాష్ట్ర కాంగ్రెస్ ట్వీట్ చేసింది. లోగడ కాంగ్రెస్ లోనే ఉన్న చౌరాసియా ఆ తరువాత ఈ పార్టీని వీడారు. హిందూ మహాసభ సభ్యుడిగా ఒకప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినా ఆ తరువాత ఓడిపోయారు. చౌరాసియా పార్టీలో చేరడాన్ని  కమల్ నాథ్ సహా నేతలంతా సమర్థించారు. తన తండ్రి (రాజీవ్ గాంధీ) కిల్లర్స్ ని ఆయన కుమారుడు, పార్టీ నేత రాహుల్ గాంధీ క్షమించారని, గాంధీ కుటుంబం విశాల హృదయానికి ఇది నిదర్శనమని ఓ నేత అన్నారు. గాడ్సేని అభిమానించిన వ్యక్తి కూడా ‘గాంధీజీ’ ని (రాహుల్ ని) పూజించడం గొప్ప విషయమని గ్వాలియర్ కి చెందిన ప్రవీణ్ పాఠక్ అనే ఎమ్మెల్యే అన్నారు.

కాగా గతంలో తను కాంగ్రెస్ లో ఉన్నానని, మధ్యలో దూరమైనా మళ్ళీ ఇప్పుడు పార్టీలో చేరడం తన కుటుంబాన్ని కలుసుకున్నట్టే ఉందని చౌరాసియా పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్ లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ గెలవాలని భావిస్తోంది. గ్వాలియర్-చంబాల్ రీజన్ లో గత ఉపఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా హవా ఎక్కువగా ఉంది. ఇలా ఉండగా నాథూరామ్ గాడ్సే చివరి కోర్టు వాంగ్మూలాన్ని తాను దేశంలో లక్ష మందికి చేరవేయాలనుకుంటున్నానని ప్రకటించి 2017 లో చౌరాసియా సంచలనం రేపాడు. అదే ఏడాది గాడ్సే విగ్రహం ముందు ప్రార్థనలు చేసినవారిలో ఈయన కూడా ఉన్నాడు. లోగడ గ్వాలియర్ మున్సిపల్ వార్డులో గాడ్సేకు అంకితం చేసిన చిన్నపాటి టెంపుల్ కూడా ఉందట.

 

Also Read:

Farm Laws: వ్యవసాయ చట్టాల అమలు అప్పటివరకు సాధ్యం కాదు.. రైతులతో చర్చలకు రెడీగానే ఉన్నాం.. కేంద్ర మంత్రి తోమర్

ఈ చిన్న సూచనలు పాటించండి.. మోసగాళ్ల నుంచి సేవ్ అవ్వండి..