World Famous Lover: వరల్డ్ ఫేమస్ లవర్ ట్విట్టర్ రివ్యూ.. దేవరకొండ ఇరగదీశాడుగా..

|

Feb 14, 2020 | 3:26 PM

క్రాంతి మాధవ్ ఎంచుకున్న స్టోరీలైన్ బాగుంది. అంతేకాక సువర్ణ-శీనయ్యల ఎపిసోడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.  ఫస్ట్ హాఫ్‌ మొత్తం ఎంటర్టైనింగ్‌గా సాగితే.. సెకండ్ హాఫ్ అక్కడక్కడా బోర్ అనిపిస్తుంది. ఇక బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా మొదటిసారి తన కెరీర్‌లో...

World Famous Lover: వరల్డ్ ఫేమస్ లవర్ ట్విట్టర్ రివ్యూ.. దేవరకొండ ఇరగదీశాడుగా..
Follow us on

World Famous Lover: రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, క్యాథరిన్, ఇజాబెల్లే‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాక ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.(Vijay Sethupathi)

‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి క్లాసిక్ సినిమాలు రూపొందించిన క్రాంతి మాధవ్.. ఈ సినిమాను కాస్త డిఫరెంట్‌గా టేకప్ చేశారని చెప్పాలి. ట్రెండ్‌కు తగ్గట్టుగా విజయ్‌తో ప్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టైటిల్‌కు యాప్ట్ అయ్యే విధంగా తనదైన మార్క్‌లో నాలుగు ప్రేమ కథలను దర్శకుడు అద్భుతంగా చూపించారు. అటు విజయ్ దేవరకొండ కూడా నాలుగు డిఫరెంట్ షేడ్స్‌లో మరోసారి తన వైవిధ్యమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు.

Also Read: Ala Vaikuntapuram Lo Hindi Remake

క్రాంతి మాధవ్ ఎంచుకున్న స్టోరీలైన్ బాగుంది. అంతేకాక సువర్ణ-శీనయ్యల ఎపిసోడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.  ఫస్ట్ హాఫ్‌ మొత్తం ఎంటర్టైనింగ్‌గా సాగితే.. సెకండ్ హాఫ్ అక్కడక్కడా బోర్ అనిపిస్తుంది. ఇక బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా మొదటిసారి తన కెరీర్‌లో ఈ సినిమాలోని తన పాత్రతో పెద్ద సాహసం చేసిందని చెప్పాలి. మరోవైపు ఇజాబెల్లే, క్యాథరిన్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

క్రాంతి మాధవ్ గత సినిమాలకు మాదిరిగానే ఈ చిత్రంలో కూడా ఎమోషన్స్ అద్భుతంగా పండాయి. విజయ్ నటించిన కార్మికుడి పాత్ర మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. అయితే కొన్ని చోట్ల ‘అర్జున్ రెడ్డి’ వేరియేషన్స్ కనిపించడం కాస్త మైనస్. మొత్తంగా వరల్డ్ ఫేమస్ లవర్‌తో దేవరకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా కొట్టాడనే చెప్పాలి.