కొడుకు కోసం పోలీసుల కళ్లల్లో కారం కొట్టిన తల్లి

పుత్రుడి మీద ప్రేమానురాగం ఆమెను కటకటాల వెనక్కు నెట్టింది.. నిందితుడైన తన కొడుకును అరెస్ట్‌ నుంచి తప్పించడానికి ఓ తల్లి చేసిన ప్రయత్నం ఆమె మెడకే చుట్టుకుంది.. అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసుల కళ్లల్లో కారం కొట్టింది.. అలా తన కొడుకు పారిపోయేందుకు వీలు కల్పించింది.. ముంబాయిలోని అంబుజ్వాడిలో జరిగిందీ సంఘటన.. అక్కడ ఉంటున్న ఓ వ్యక్తిపై అనేక కేసులున్నాయి.. ఇప్పటికప్పుడు అరెస్ట్‌ కావడం బయటకు రావడం రివాజుగా మారింది.. ఇలా ఓ రోజు ఇద్దరు పోలీసులు […]

కొడుకు కోసం పోలీసుల కళ్లల్లో కారం కొట్టిన తల్లి
Follow us
Balu

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 09, 2020 | 12:20 PM

పుత్రుడి మీద ప్రేమానురాగం ఆమెను కటకటాల వెనక్కు నెట్టింది.. నిందితుడైన తన కొడుకును అరెస్ట్‌ నుంచి తప్పించడానికి ఓ తల్లి చేసిన ప్రయత్నం ఆమె మెడకే చుట్టుకుంది.. అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసుల కళ్లల్లో కారం కొట్టింది.. అలా తన కొడుకు పారిపోయేందుకు వీలు కల్పించింది.. ముంబాయిలోని అంబుజ్వాడిలో జరిగిందీ సంఘటన.. అక్కడ ఉంటున్న ఓ వ్యక్తిపై అనేక కేసులున్నాయి.. ఇప్పటికప్పుడు అరెస్ట్‌ కావడం బయటకు రావడం రివాజుగా మారింది.. ఇలా ఓ రోజు ఇద్దరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడానికి ఇంటికొచ్చారు.. తన కొడుకును అరెస్ట్‌ చేయడానికి వచ్చారని గ్రహించిన ఆ నిందితుడి తల్లి పోలీసుల కళ్లల్లో కారంపొడి కొట్టింది.. పోలీసులు కళ్లు మూసుకోగానే అతగాడు అక్కడ్నుంచి పలాయనం చిత్తగించాడు.. ఇంత జరిగిన తర్వాత పోలీసులు గమ్మునేమి ఉండరు కదా! నిందితుడిని సపోర్ట్ చేసినందుకు పదవమ్మా పద అంటూ జీపెక్కించారు.. ఆ తర్వాత నిందితుడి మాల్వానిలో ఉన్నాడని తెలుసుకుని అతడినీ అదుపులోకి తీసుకున్నారు..