అమెరికాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఎవరికి తెలియకుండా రాత్రి బార్‌కు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే కెంటుకీ ప్రాంతంలోని జార్జ్ టౌన్‌లో డొన్న మార్టిన్ అనే మహిళ స్థానికంగా ఉన్న ఓ బార్‌లో రహస్యంగా చొరబడింది. బార్ క్లోజ్ చేసే సమయంలో అందరికి తెలియకుండా ఓ మూలన నక్కి.. క్లీనింగ్ స్టాఫ్ పని పూర్తి చేసుకుని వెళ్లిన తర్వాత లోపలికి వెళ్లి చేతికందిన మందు తాగుతూ తెగ ఎంజాయ్ చేసింది. తనకు నచ్చిన డీజే ప్లే చేసుకుంటూ, చిందులు వేస్తూ బార్ మొత్తం ఓ ప్లే గ్రౌండ్ లా మార్చేసి ఆడేసుకుంది.
ఇక చివరికి అలిసిపోయి అక్కడే ఉన్న ఓ టేబుల్‌పై మత్తులోకి జారుకుంది. అయితే ప్రొద్దునే వచ్చిన సిబ్బంది ఈమెను లోపల చూసి ఖంగుతున్నారు. కాగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు.