AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బీచ్‌లో వాకింగ్ వెళ్లిన మహిళకు మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని వెళ్లి చూడగా..

పురాతన కాలంలో దాచిపెట్టిన నిధులు ఇప్పటి ప్రజలకు దొరుకుతూ వారు జీవితాన్నే మార్చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలు గురించి విన్నాం. ఇటీవల సిద్దిపేటలో ఉపాది హామి కూలీలు తవ్వుతుండగా వెండి నాణేల డబ్బా బయటపడింది. తాజాగా.....

Viral: బీచ్‌లో వాకింగ్ వెళ్లిన మహిళకు మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని వెళ్లి చూడగా..
Silver Coins
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2024 | 3:38 PM

Share

పురాతన కాలంలో బందిపోట్ల నుంచి తమ సంపదను రక్షించుకోడానికి.. నిధి, నిక్షేపాలను పొలాల్లో… ఇంటి నిర్మాణాల సమయంలో గోడల్లో దాచేవారు. తదనంతర కాలంలో.. వారు కాలం చేయడం వల్ల ఆ నిధి మరుగున పడిపోయేది. పలు సందర్భాల్లో తవ్వకాలు జరిపేటప్పడు, పాత నిర్మాణాలను కూల్చేటప్పుడు, పొలం దున్నేటప్పుడు విభిన్న కాలాలకు చెందిన వెండి బంగారు నాణేలు, నిధి వంటివి బయటపడిన ఘటనలు చూస్తేనే ఉన్నాం.  ఈ క్రమంలో వ్యవహారం బయటకు పొక్కితే నిధిని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. కొందరు గుట్టు చప్పుడు కాకుండా ఆ నిధిని కాజేస్తూ ఉంటారు. తాజాగా చెక్ రిపబ్లిక్‌లోని కుత్నా హో  అనే ఒక చిన్న పట్టణంలో గల బీచ్‌లో వాకింగ్‌కి వెళ్లిన ఒక మహిళకు కూడా ఇలానే లక్కే వరించింది. నడుస్తున్న సమయంలో ఆమెకు ఇసుకలో దూరంగా ఏవో మెరుస్తూ కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూడగా.. వెండి నాణేలు..  అక్కడే మొత్తం  2,150 కంటే ఎక్కువ పురాతన వెండి నాణేలు కనిపించాయి. ఈ నాణేలు చాలా పురాతనమైనవి, 1085 నుండి 1107 మధ్య కాలానికి చెందినవి అని నిపుణులు చెబుతున్నారు. వీటిని బహుశా ప్రేగ్‌లో తయారు చేసి.. ఆ తర్వాతి కాలంలో బోహెమియాకు తరలించి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ నాణేలు ఎక్కువగా వెండితో తయారు చేయబడ్డాయని.. కొద్దిగా రాగి, సీసం, ఇతర లోహాలు కలిపి తయారు చేసినట్లు తెలిపారు. కాయిన్స్‌లోని లోహాలను టెస్ట్ చేయడం ద్వారా, నిపుణులు వాటి చరిత్ర గురించి మరింత విశ్లేషణ చేసేందుకు  ప్రయత్నిస్తున్నారు. ఫిలిప్ వెలిమ్స్కీ అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ ఓల్డ్ కాయిన్స్ కొన్ని పోరాటాల కారణంగా భూమిలో పాతిపెట్టి ఉండవచ్చు అని చెబుతున్నారు.

ఈ నాణేలు తొలుత తయారు చేసినప్పుడు చాలా విలువైనవి. నేడు వాటి విలువ మరింత ఎక్కువ ఉంటుందని, కోట్లాది రూపాయల వరకు ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. గత పది సంవత్సరాలలో కనుగొన్న అతిపెద్ద నిధి ఇదేనని అక్కడి ప్రజలు చెబుతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నాణేలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి, వాటిలో ఏ లోహాలు ఉన్నాయో కచ్చితంగా తెలుసుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నారు. అన్ని విశ్లేషనల తర్వాత 2025లో వీటిని ప్రదర్శకు పెట్టే అవకాశం ఉంది. (Source)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌