విజయవాడ మహిళా డాక్టర్ సూసైడ్ కలకలం రేపుతోంది. భవానీపురంలో నివసిస్తున్న దేవీ ప్రియాంక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి ఆమె సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవీ ప్రియాంక గుంటూరు జిల్లాలోని కాటూరు మెడికల్ కళాశాలలో పలమనాలజీలో ఎండీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆమె రాసిన సూసైడ్ లెటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు నవీన్ కారణమని సూసైడ్ లెటర్ లో దేవీ ప్రియాంక రాసింది. నవీన్ అనే ఎవరు అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు ప్రారంభించారు. దేవీ ప్రియాంక సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుని..కుటుంబ సభ్యలను విచారిస్తున్నారు.