లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్న వేళ.. ఆశీర్వాద్ ఆటా కోసం ఊరంతా తిరిగిన ప్రబుద్ధులను చూశాం… ఇలాంటి వాళ్లు ఇక్కడే కాదు, జెండర్‌తో నిమిత్తం లేకుండా ప్రపంచమంతా ఉంటారు.. ఆస్ట్రేలియాలో కొన్ని చోట్ల ఇప్పుడు లాక్‌డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి.. విక్టోరియా, మెల్‌బోర్న్ నగరాలలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో అక్కడ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.. ఇలాంటి టైమ్‌లో మెల్‌బోర్న్‌లోని వెర్రిబీలో ఉన్న ఓ మహిళకు కబాబ్ తినాలన్న కోరిక పుట్టింది.. వెంటనే కబాబ్ కోసం ఇంటి నుంచి బయటకెళ్లింది.. అలా కబాబ్‌ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ 75 కిలోమీటర్లు ప్రయాణించింది.. ఎక్కడి జిలాంగ్…ఎక్కడి మెల్‌బోర్న్… అంత దూరం వచ్చిన మహిళను పోలీసులు అడ్డుకున్నారు.. ఏం చేయడానికి బయటకు వచ్చావని ప్రశ్నించారు.. ఆమె అమాయకంగా కబాబ్ కోసమని చెప్పింది.. ఆమె ఆన్సర్‌కు పోలీసులకు నవ్వు వచ్చినా .. దాన్ని కంట్రోల్ చేసుకుని తప్పు కదా అని నాలుగు అక్షింతలు వేసి, ఆపై జరిమానా కూడా విధించారు…