దేశంలో క‌రోనా క‌ల్లోలం.. ఒక్క‌రోజే 60 వేలకుపైగా కేసులు..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు 60 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. అయితే రోజురోజుకు కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ,

దేశంలో క‌రోనా క‌ల్లోలం.. ఒక్క‌రోజే 60 వేలకుపైగా కేసులు..!

Edited By:

Updated on: Aug 12, 2020 | 11:10 AM

Coronavirus In India:  దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు 60 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. అయితే రోజురోజుకు కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ, మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టంతోపాటు కోలుకుంటున్న‌వారి సంఖ్య కూడా పెరుగుతున్న‌ది. దీంతో దేశంలో క‌రోనా రిక‌వరీ రేటు 70 శాతానికి ద‌గ్గ‌ర‌లో ఉన్నది.

దేశ‌వ్యాప్తంగా గ‌డచిన 24 గంట‌ల్లో 60,963 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 23,29,639కి చేరింది. ఇందులో 6,43,948 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 16,39,600 మంది బాధితులు కోలుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల 834 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణాలు 46,091కి చేరాయి. నిన్నటి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 2,60,15,297 మందికి క‌రోనా పరీక్ష‌లు చేశామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 11న 7,33,449 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది. ఒకేరోజు ఇంత పెద్ద‌మొత్తంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి.

Also Read: తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!