నిర్లక్ష్యంగా ఉంటే.. వైరస్ సోకే ప్రమాదంః వైద్య ఆరోగ్య శాఖ

| Edited By: Pardhasaradhi Peri

Oct 27, 2020 | 9:25 PM

చలికాలం వచ్చేస్తోంది.. ఇదే సీజన్‌లో జలుబు, జ్వరం లాంటివి రావడం సర్వసాధారణం. ఈసారీ చలికాలం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తల్లో ఆందోళన పెంచుతోంది.

నిర్లక్ష్యంగా ఉంటే.. వైరస్ సోకే ప్రమాదంః వైద్య ఆరోగ్య శాఖ
Follow us on

చలికాలం వచ్చేస్తోంది.. ఇదే సీజన్‌లో జలుబు, జ్వరం లాంటివి రావడం సర్వసాధారణం. ఈసారీ చలికాలం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తల్లో ఆందోళన పెంచుతోంది. చలి వాతావరణంలో కరోనావైరస్ మరింత ఉద్ధృతరూపం దాల్చే ప్రమాదం ఉందని.. వేగంగా వ్యాపించవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.

వైరసులు, బ్యాక్టీరియాలు విజృంభించటానికి ఇది అనుకూలమైన కాలం. డెంగీ, మలేరియా , స్వైన్ ఫ్లూ గత సంవత్సరంతో పోలిస్తే 40 నుంచి 50 శాతం తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య వెల్లడించింది. గత నెలరోజులుగా కొవిడ్ కూడా తగ్గు ముఖం పట్టింది. అయినప్పటికీ, కరోనా పూర్తిగా తగ్గినట్లు కాదంటున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే, వైరస్ సోకే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఐరోపా ల్లో ఇప్పటికే సెకండ్ వేవ్ వణికిస్తోంది. రాష్ట్రంలోను కేసులు మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరు కరోనా పట్ల జాగ్రత్తలు తప్పనిసరి అని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ

శీతాకాలంలో ప్రపంచం కరోనావైరస్ ‘సెకెండ్ వేవ్’ ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్న తరుణంలో అధికారులు ముందుజాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. వైరస్ ఇంతకు ముందుకంటే ప్రాణాంతకం కావచ్చంటున్నారు.