బ్రేకింగ్: ప్యాసింజర్ రైళ్లలో వారికి అనుమతి నిరాకరణ..

| Edited By:

May 27, 2020 | 5:16 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే.

బ్రేకింగ్: ప్యాసింజర్ రైళ్లలో వారికి అనుమతి నిరాకరణ..
Follow us on

No Mask No Journey: కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. కాగా.. జూన్ 1 నుంచి రైలు ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే సిపిఆర్ఓ రాకేష్ ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 తో మాట్లాడుతూ.. జూన్ ఒకటి నుంచి ప్రయాణించే రైళ్లలో ‘నో మాస్క్.. నో జర్నీ’ సిద్ధాంతాన్ని అమలుపరుస్తామని తెలిపారు. మాస్క్ లు లేకుండా స్టేషన్లకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మాస్క్ లేకుండా ఎవరైనా వస్తే, వారిని స్టేషన్ లోనికి అనుమతించమని తెలిపారు.

ఒకటో తేదీ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుండి 32 రైళ్లు నడుస్తాయని చెప్పారు. ఢిల్లీ ,హౌరా,గుంటూరు ,వైజాగ్,బాంబే, తిరుపతి,తదితర ప్రాంతాలకు రైళ్లు నడపనున్నట్లు వివరించారు. ఇప్పటికే అనేక రైళ్లకు ప్రయాణీకులు రిజర్వేషన్లు బుక్ చేసుకున్నారని స్పష్టంచేశారు. ప్రయాణాల్లో కోవిద్-19 నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహరించాలని, దశల వారిగా రైళ్ల ను పెంచేందుకే ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రైల్వే బుకింగ్స్ దగ్గర నుండి రైళ్లు ఎక్కే వరకు, తిరిగి ప్రయాణికులు బయటకి వెళ్లే వరకు పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించాలని కోరారు. స్టేషన్ కి వచ్చిన ప్రయాణికుడికి థర్మల్ స్కీనింగ్ చేసిన స్టాంపింగ్ వేసి ఇళ్లకు పంపిస్తామని వివరించారు.

Also Read: వీడిన ఆకుపచ్చ కోడిగుడ్ల మిస్టరీ.. అసలు కారణం ఏంటంటే?