24 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం- యడ్యూరప్ప

|

Mar 12, 2019 | 7:34 AM

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ 22 సీట్లు గెలిచిన 24 గంటల్లో కర్ణాటక కూటమి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సోమవారం సవాల్ విసిరారు. భాజపా ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలు పెట్టిందని ఆయన పేర్కొన్నారు.బెళగావి జిల్లాలోని యారగట్టిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కన్నడ నాట భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకెంతో సమయం పట్టదు. నేను ఈ మాటను గర్వంతోనో, పార్టీ బలం చూసుకునో […]

24 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం- యడ్యూరప్ప
Follow us on

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ 22 సీట్లు గెలిచిన 24 గంటల్లో కర్ణాటక కూటమి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సోమవారం సవాల్ విసిరారు. భాజపా ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలు పెట్టిందని ఆయన పేర్కొన్నారు.బెళగావి జిల్లాలోని యారగట్టిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కన్నడ నాట భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకెంతో సమయం పట్టదు. నేను ఈ మాటను గర్వంతోనో, పార్టీ బలం చూసుకునో చెప్పడం లేదు. లోక్‌ సభ ఎన్నికల్లో భాజపా 22 సీట్లు గెలిస్తే..ఆ మరుసటి రోజే కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని దించేస్తాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి కుమార స్వామి ఇక ఎన్నోరోజులు కొనసాగబోరు. కర్ణాటకలోని 6.5కోట్లమంది ప్రజలు కుమార స్వామి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. దాన్ని పోగొట్టాలంటే ఒక్క భాజపా వల్లనే సాధ్యం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా అమలు చేయడం లేదు. ఇక్కడున్న 28లోక్‌ సభ స్థానాల్లో గెలవడంపై మేం దృష్టి సారించాం. దీన్ని మేం బాధ్యతగా తీసుకున్నాం’ అని యడ్యూరప్ప అన్నారు.