
విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యకు కరోనా సోకిందని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. పార్వతీపురం చెందిన ఓ మహిళ కొద్దిరోజులు అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. తన భార్యకు కరోనా సోకిందని భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలచివేసింది. బాధితుడికి భార్యకు కరోనా సోకడం.. భర్త చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.