Wife File Case For Bald Head: భార్యభర్తల మధ్య గొడవలు రావడానికి ఎన్నో కారణలుంటాయి. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు. కానీ చెన్నై తిరుమంగళంకు చెందిన ఓ భార్య మాత్రం వింత కారణంతో తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడనేది సదరు మహిళ వాదన. ఇంతకీ ఆ భర్త చేసిన మోసమేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
చెన్నై ఆలపాక్కంకు చెందిన వ్యక్తి 2015లో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. నిజానికి ఆ వ్యక్తికి పెళ్లికి ముందు బట్టతల ఉండేది దీంతో విగ్ ధరించి ఆ విషయాన్ని కాబోయే భార్యకు చెప్పకుండా ఎలాగోలా పెళ్లి చేసుకున్నాడు. అలా ఆ నిజాన్ని ఐదేళ్ల పాటు భార్యకు తెలియకుండా నెట్టుకొచ్చాడు. కానీ తాజాగా సదరు వ్యక్తికి బట్టతల ఉందనే విషయం భార్యకు తెలిసిపోయింది. దీంతో ఒక్కసారి కోపానికి గురైన ఆమె.. తన భర్త తనను మోసం చేసి వివాహం చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కట్నంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలను వాపసు చేయాలని డిమాండ్ చేయగా ఆమెపై భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త దాడి చేశారు. విగ్ పెట్టుకుని మోసగించిన భర్త రాజశేఖర్, అత్తింటి వారిపై చర్య తీసుకోవాలంటూ బాధితురాలు చెన్నై తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటర్నెట్ వివాహ వేదికలోని వివరాలు చూసి మోసపోయానని ఆమె వాపోయింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: వయసు 23.. చూడటానికి అమాయకుడు.. కానీ ఏకంగా 11 మందిని పెళ్లిచేసుకున్నాడు.. చివరకు..