యూరప్ కు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక.. కరోనా మళ్లీ విజృంభించే ఛాన్స్..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ వల్ల లక్షల ప్రాణాలను కోల్పోయిన యూరప్ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే ప్రమాదం
Coronavirus in europe: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ వల్ల లక్షల ప్రాణాలను కోల్పోయిన యూరప్ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, మహమ్మారి మళ్లీ రాబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.
కాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. యూరప్ అధ్యక్షుడు హాన్స్ క్లూగ్ మాట్లాడుతూ, యూరప్ దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుందని, దీనిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘ప్రస్తుత కాలంలో కోవిడ్-19 కనుమరుగయ్యే అవకాశం లేదు. కరోనా తగ్గుముఖ్యం పడుతున్నట్లు కనపడినప్పటికీ మనం ఇంకా దాని గుప్పిట్లోనే ఉన్నాం. అవకాశం ఉన్న ప్రతి చోటా వైరస్ మళ్లీ తిరగబెడుతుంది. మనమంతా జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు.
Also Read: ఇరాక్‌లో పారామిలటరీ దళాల దాడి.. ఏడుగురు ఉగ్రవాదులు హతం..