షాకింగ్ రిపోర్ట్.. కరోనా వైరస్ మరో రెండేళ్ల వరకూ ఉంటుందట!

ఈ వైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గదని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. 2022 వరకూ దీని ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఈ రిపోర్ట్‌తో ప్రపంచ దేశాలు షాక్‌కి..

షాకింగ్ రిపోర్ట్.. కరోనా వైరస్ మరో రెండేళ్ల వరకూ ఉంటుందట!
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 5:56 PM

ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ప్రజలెవరూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా కాస్త తగ్గు ముఖం పడితే బావుండు.. లాక్‌డౌన్ ఎత్తివేయాలని చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. అయితే ఈ వైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గదని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. 2022 వరకూ దీని ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఈ రిపోర్ట్‌తో ప్రపంచ దేశాలు షాక్‌కి గురవుతున్నాయి.

‘యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ విభాగం’ తమ రిపోర్ట్‌‌లో పేర్కొన్నారు. ప్రపంచంలో మూడింట రెండు వంతుల మందికి రోగ నిరోధక శక్తి పెరిగేవరకూ ఇది ఉంటుందని వారు లెక్కలు వేస్తున్నారు. సహజంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఈ వైరస్ మరింత త్వరగా పాకే గుణం ఉందని, కరోనా వైరస్ నివారణ అంత సులువు కాదని అంటున్నారు. వ్యాక్సిన్లు ఉన్నా కూడా దీన్ని అప్పుడే అదుపు చేయడం కుదరదని వారు రిపోర్టులో తెలిపారు. వైరస్ లక్షణాలు కనిపించడానికి ముందే అంది సోకిన వారిలో ఇన్‌ఫెక్షన్ ఉంటుందని ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించి ప్రజలకు వైరస్ సోకుండా చూస్తున్నాయి. అలాగే ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య కేంద్రాలను తెరిచేందుకు అనుమతి ఇస్తున్నాయి. అయితే, ఈ కరోనా వైరస్ విడతల వారీగా 2022 వరకూ ఉండొచ్చని ‘యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ విభాగం’ తమ నివేదికలో పేర్కొంది. ఇక ‘ప్రభుత్వ అధికారులు చెబుతున్న వివరాలను పరిశీలిస్తే ఈ మహమ్మారి అంత త్వరగా అంతం కాదు.. ప్రజలు మానసికంగా 2022 వరకూ సిద్ధమవ్వాలి’ అని పరిశోధికులు చెబుతున్నారు.

Read More:

ఏపీకి వచ్చే వారి కోసం సీఎం జగన్ న్యూ రూల్స్!

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి