కరోనా కట్టడి కోసం.. ప్రపంచవ్యాప్తంగా 70 రకాల వ్యాక్సిన్ల తయారీ..

| Edited By:

Apr 14, 2020 | 12:34 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.దీనిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా 70 రకాల వ్యాక్సిన్లు తయారవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ 70లో మూడు వ్యాక్సిన్లను ముగ్గురు వ్యక్తులపై

కరోనా కట్టడి కోసం.. ప్రపంచవ్యాప్తంగా 70 రకాల వ్యాక్సిన్ల తయారీ..
Follow us on

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.దీనిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా 70 రకాల వ్యాక్సిన్లు తయారవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ 70లో మూడు వ్యాక్సిన్లను ముగ్గురు వ్యక్తులపై (human trials) ప్రయోగిస్తున్నారు కూడా. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనది ఏదంటే… కరోనా వ్యాక్సినే అని మనం చెప్పుకోవచ్చు. దీని తయారీలో 70 ఫార్మా కంపెనీలు, సంస్థలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఏది సక్సెస్ అయినా.. కరోనా కథ ముగిసినట్లే.

కాగా.. హాంకాంగ్ కు చెందిన కాన్సినో బయోలాజిక్స్ (cansino biologics), చైనా బీజింగ్ కు చెందిన బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి ఓ వ్యాక్సిన్ తయారుచేశాయి. దాన్ని మనుషులపై ప్రయోగిస్తున్నాయి. ఈ ప్రయోగాలు తొలి దశ ముగిసి… రెండో దశకు చేరాయి. అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్స్ (Inovio Pharmaceuticals)తోపాటూ… మరో కంపెనీ కూడా… మనుషులపై తమ వ్యాక్సిన్లను ప్రయోగిస్తున్నాయి. ఫార్మా రంగంలో దిగ్గజాలైన Pfizer Inc., Sanofi కంపెనీలు చేస్తున్న వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రి-క్లినికల్ స్టేజ్లో ఉన్నట్లు WHO తెలిపింది.