గ్రేటర్ పరిథిలో ఆర్టీసీ బస్సులకు మోక్షం ఎప్పుడు..?

|

Aug 31, 2020 | 7:10 PM

కరోనా దెబ్బకు కుదేలైన తెలంగాణ ఆర్టీసీ ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఆర్టీసీ ఆదాయంలో అధిక భాగం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని బస్సుల ద్వారా అందుతుంది. అయితే, కొవిడ్‌-19 అన్‌లాక్‌ 4.0లోనూ మోక్షం కలిగేలా లేదు. లాక్‌డౌన్‌ తర్వాత దశలవారీగా పలు విభాగాలకు అనుమతిస్తుండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆర్టీసీ బస్సులకు అనుమతిపై స్పష్టత ఇవ్వలేదు.

గ్రేటర్ పరిథిలో ఆర్టీసీ బస్సులకు మోక్షం ఎప్పుడు..?
Follow us on

కరోనా దెబ్బకు కుదేలైన తెలంగాణ ఆర్టీసీ ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఆర్టీసీ ఆదాయంలో అధిక భాగం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని బస్సుల ద్వారా అందుతుంది. అయితే, కొవిడ్‌-19 అన్‌లాక్‌ 4.0లోనూ మోక్షం కలిగేలా లేదు. లాక్‌డౌన్‌ తర్వాత దశలవారీగా పలు విభాగాలకు అనుమతిస్తుండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆర్టీసీ బస్సులకు అనుమతిపై స్పష్టత ఇవ్వలేదు.

నగరంలో మెట్రో రైళ్లను నడిపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, ఆర్టీసీ బస్సులను నడపడంపై అంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న ముంబై మహానగరంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బస్సులు రెండు నెలల నుంచి నడుస్తున్నాయి. కానీ, జిల్లాల్లో బస్సలకు అనుమతినిచ్చినప్పటికీ గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం అవసరాల కోసం వివిధ సందర్భాల్లో నగరంలో ఆర్టీసీ బస్సులను వినియోగిస్తుండగా, ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఐదు నెలలకు పైగా గ్రేటర్‌ పరిధిలోని 29 డిపోల నుంచి సుమారు 3,540 ఆర్టీసీ బస్సులు కదల్లేదు. లాక్‌డౌన్‌ కంటే ముందు నుంచి నగరంలో ప్రతిరోజు 2,600ల ఆర్టీసీ బస్సులు వివిధ మార్గాల్లో 9.15 లక్షల కిలోమీటర్ల మేర తిరిగాయి.

ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అత్యవసరమై ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ట్యాక్సీలు, ఆటోల చార్జీలు మోత మోగుతున్నాయి. పోనీ, సొంత వాహనాల్లో వెళ్లాటంటే పెట్రోల్ ధర కూడా వాత పెడుతోంది. కాగా, పారిశుధ్య కార్మికులను ఇళ్ల నుంచి పనులకు తరలించేందుకు, సెక్రటేరియట్‌ ఉద్యోగుల కోసం బస్సులు తిప్పుతున్నారు. కాగా, సామాన్య జనానికి మాత్రం ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. అయితే, ప్రభుత్వం అనుమతిస్తే.. సంసిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు