
Wheel on Toilets in Municipalities : తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అర్భన్ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మున్సిపాలిటీలలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా చర్యలను తీసుకుంటోంది. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ రోడ్లను మరమ్మత్తు చేసింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ‘వీల్ ఆన్ టాయిలెట్స్’ను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాలి సూచించారు. ఆగస్ట్ 15లోపు అర్బన్ ప్రాంతాల్లో టాయిలెట్స్ పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిలలో టాయిలెట్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని వెల్లడించారు.