దిశ ఘటన: నెంబర్‌ను బ్లాక్‌ చేసిన వాట్సాప్ సంస్థ

| Edited By: Srinu

Dec 09, 2019 | 2:09 PM

సైబరాబాద్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్‌ను ఆ సంస్థ బ్లాక్ చేసింది. దిశ హత్యాచార ఘటన అనంతరం.. పోలీసులు.. మహిళల కోసం.. ‘94906 17444’ ప్రత్యేకమైన ఫోన్ నెంబర్‌ను కేటాయించిన విషయం విదితమే. అయితే.. ఈ నెంబర్‌కు ప్రాంతాల వారీగా.. మెసేజ్‌లు ఒకేసారి వెల్లువెత్తాయి. ఈ మెసేజ్‌ల పట్ల వాట్సాప్ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. అపరిమిత సంక్షిప్త సమాచారం కూడా వస్తుండటంతో.. వాట్సాప్ సంస్థ.. ఈ నెంబర్‌ను నిలిపివేసింది. ఇట్పివరకూ ఈ నెంబర్‌కి 5 లక్షలకు […]

దిశ ఘటన: నెంబర్‌ను బ్లాక్‌ చేసిన వాట్సాప్ సంస్థ
Follow us on

సైబరాబాద్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్‌ను ఆ సంస్థ బ్లాక్ చేసింది. దిశ హత్యాచార ఘటన అనంతరం.. పోలీసులు.. మహిళల కోసం.. ‘94906 17444’ ప్రత్యేకమైన ఫోన్ నెంబర్‌ను కేటాయించిన విషయం విదితమే. అయితే.. ఈ నెంబర్‌కు ప్రాంతాల వారీగా.. మెసేజ్‌లు ఒకేసారి వెల్లువెత్తాయి. ఈ మెసేజ్‌ల పట్ల వాట్సాప్ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. అపరిమిత సంక్షిప్త సమాచారం కూడా వస్తుండటంతో.. వాట్సాప్ సంస్థ.. ఈ నెంబర్‌ను నిలిపివేసింది. ఇట్పివరకూ ఈ నెంబర్‌కి 5 లక్షలకు పైగా మెసేజ్‌లు వచ్చాయి.

ఈ విషయంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించాలని.. వాట్సాప్‌ యాజమాన్యానికి మెయిల్ పెట్టారు. అలాగే.. కొత్త వాట్సాప్‌ నంబర్‌ను ఇచ్చారు. మహిళల సమస్యలను న్యూ వాట్సాప్‌ నంబర్‌ ‘79011 14100’కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.