కేరళ సంస్థ పేరును మార్చడంలో తప్పేముంది ? సీఎం కు కేంద్ర మంత్రి సూటి ప్రశ్న

| Edited By: Pardhasaradhi Peri

Dec 06, 2020 | 7:42 PM

కేరళలో రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ సెకండ్ కాంపస్ పేరును ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్. గోల్వాకర్ పేరిట మారిస్తే తప్పేముందని కేంద్ర మంత్రి వీ.మురళీధరన్ ప్రశ్నించారు. ఒక దేశభక్తుడి పేరును..

కేరళ సంస్థ పేరును మార్చడంలో తప్పేముంది ? సీఎం కు కేంద్ర మంత్రి సూటి ప్రశ్న
Follow us on

కేరళలో రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ సెకండ్ కాంపస్ పేరును ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత కర్త ఎం.ఎస్. గోల్వాకర్ పేరిట మారిస్తే తప్పేముందని కేంద్ర మంత్రి వీ.మురళీధరన్ ప్రశ్నించారు. ఒక దేశభక్తుడి పేరును పెట్టడంలో ఎలాంటి పొరబాటు లేదన్నారు. గోల్వాకర్ బనారస్ యూఐవర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్ అని, ఒకప్పుడు నెహ్రూ ట్రోఫీ బోట్ రేసును దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట వ్యవహరించలేదా అన్నారు. నెహ్రు ఏదైనా క్రీడా పోటీల్లో పాల్గొన్నారా అని కూడా మురళీధరన్ ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్  బయో టెక్నాలజీ సెకండ్ కాంపస్ పేరును  ను శ్రీ గురూజీ మాధవ్ సదాశివ్ గోల్వాకర్ నేషనల్ సెంటర్ గా మారుస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ  కేరళ సీఎం పినరయి విజయన్  కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటికే దీనిపై రాష్ట్రంలో వివాదం తలెత్తిందన్నారు.