“ఆరే ” పార్క్‌లో చెట్ల తొలగింపుపై దీపికా ఏమందో తెలుసా?

| Edited By: Pardhasaradhi Peri

Oct 10, 2019 | 7:23 PM

మెట్రో కార్ ‌షెడ్ నిర్మాణం కోసం ముంబైలో గల ఆరే పార్క్‌లో వేలాది చెట్ల నరికివేతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. చెట్ల నరికివేతను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినందున ప్రస్తుతం కూల్చివేతలను ఆపేశారు. అయితే పర్యావరణాన్ని కాపాడటంలో చెట్లకున్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని నేలకూల్చితే ఎన్నో సమస్యలు వస్తాయని ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ దీపికా పదుకొణే కూడా స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న […]

ఆరే  పార్క్‌లో  చెట్ల తొలగింపుపై దీపికా ఏమందో తెలుసా?
Follow us on

మెట్రో కార్ ‌షెడ్ నిర్మాణం కోసం ముంబైలో గల ఆరే పార్క్‌లో వేలాది చెట్ల నరికివేతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. చెట్ల నరికివేతను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినందున ప్రస్తుతం కూల్చివేతలను ఆపేశారు. అయితే పర్యావరణాన్ని కాపాడటంలో చెట్లకున్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని నేలకూల్చితే ఎన్నో సమస్యలు వస్తాయని ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ దీపికా పదుకొణే కూడా స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. చెట్లు కూల్చివేయడం సరికాదని.. రెండు వేలు, నాలుగు వేల చెట్లను నరికివేయడం సామన్యమైన విషయం కాదంది. ఇప్పటికే సుప్రీం కోర్టు కలుగజేసుకుని ట్రీ కటింగ్‌పై స్పందించడంతో మంచే జరిగిందని చెప్పింది దీపికా. అయితే తాను చెప్పినంత మాత్రాన ఎటువంటి మార్పులు రావంటూ వ్యాఖ్యానించింది. తాను ఫుల్ టైమ్ యాక్టివిస్టునని కూడా చెప్పుకొచ్చింది దీపికా.

ముంబై మెట్రో రైలు ప్రయాణికుల కోసం మూడు కారు షెడ్‌లను నిర్మించాలని భావించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే వీటి నిర్మాణాన్ని ముంబై ఆరె ప్రాంతంలో చేపట్టాలని నిర్ణయించారు. అందుకోసం అక్కున్న వేలాది చెట్లను నేలకూల్చే దిశగా అడుగులు వేశారు. దీనికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఓకే చెప్పింది. అయితే కొంతమంది కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కొన్ని సాంకేతిక కారణాలతో ఆ పిటిషన్ కొట్టివేసింది. హైకోర్టు కేసు కొట్టివేసిన కొన్ని గంటల్లోనే చెట్ల నరికివేతను ప్రారంభించారు అధికారులు. దీంతో గత శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరే ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించారు. అయితే చెట్ల నరికివేతపై స్పందించిన సుప్రీం కోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. మరోవైపు సామాజిక కార్యకర్తల ఉద్యమానికి శివసేన సైతం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.