West Bengal CM Vs Central Government:కేంద్రం తో సై అంటే సై అంటున్న దీదీ.. థియేటర్లలో ఆక్యుపెన్సీని పెంచుతూ నిర్ణయం

West Bengal CM Vs Central Government: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయికి విబేధాలు చేసుకున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. సై అంటే సై అంటుంది దీదీ. తాజాగా బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మరో సంచనల నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ ఆగలేదు.. వ్యాక్సిన్ పంపిణీ ఇంకా మొదలు కాలేదు. .అయినా […]

West Bengal CM Vs Central Government:కేంద్రం తో సై అంటే సై అంటున్న దీదీ.. థియేటర్లలో ఆక్యుపెన్సీని పెంచుతూ నిర్ణయం

Updated on: Jan 08, 2021 | 7:06 PM

West Bengal CM Vs Central Government: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయికి విబేధాలు చేసుకున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. సై అంటే సై అంటుంది దీదీ. తాజాగా బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. మరో సంచనల నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ ఆగలేదు.. వ్యాక్సిన్ పంపిణీ ఇంకా మొదలు కాలేదు. .అయినా సరే తమ రాష్ట్రంలో సినిమా థియేటర్స్ లో నూరు శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుమమత.

శుక్రవారం 26 వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న సీఎం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సినిమా హాల్స్ లో పూర్తి స్థాయి టికెట్స్ విక్రయానికి అనుమతులిచ్చారు. ఇటీవలే థియేటర్స్ యజమానులు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించాలని దీదీని కోరారు. అయితే సీఎం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించింది.  మరోవైపు థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతంనుంచి 100 పెంచాలని కోరుతూ ఫిల్మ్‌ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కలైపులితాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఒక లేఖ రాశారు. కాగా సినిమా హాళ్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమితినిస్తూ తమిళనాడు రాష్ట్రం తీసుకున్న నిర్ణయం పై కేంద్రం స్పందించింది. తమిళనాడు ప్రభుత్వం చర్య కోవిడ్‌-19 నిబంధనలకు విరుద్ధమని, వెంటనే తమ జీవోను వెనక్కి తీసుకోవాలని పళని సర్కార్‌ను కోరింది. 50 శాతానికి మాత్రమే అనుమతి నివ్వాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Also Read: నేను కోవిడ్ బాధితురాలినే .. వైరస్ ప్రభావం తగ్గిందనుకోవద్దంటున్న రేణు దేశాయ్