వడదెబ్బకు 24 మంది మృతి..

తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణితో.. ఎండల తీవ్రత మరింత పెరిగింది. గాలిలో తగ్గిన తేమ శాతం తగ్గిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాల్పుల ప్రభావం మూడు రోజుల పాటు ఉంటుందని, అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు అధికంగా నమోదుకావడంతో ఇళ్ల నుంచి బయటికి రావడానికే ప్రజలు భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ […]

వడదెబ్బకు 24 మంది మృతి..

Edited By:

Updated on: May 07, 2019 | 12:48 PM

తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణితో.. ఎండల తీవ్రత మరింత పెరిగింది. గాలిలో తగ్గిన తేమ శాతం తగ్గిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాల్పుల ప్రభావం మూడు రోజుల పాటు ఉంటుందని, అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డిగ్రీలు అధికంగా నమోదుకావడంతో ఇళ్ల నుంచి బయటికి రావడానికే ప్రజలు భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడదెబ్బకు ఏడుగురు, ఏపీలో 17 మంది మృతి చెందారు.