తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రేగిన జల వివాదాలు..!

| Edited By:

Nov 15, 2019 | 6:32 PM

ఏపీ-తెలంగాణ మధ్య విభజన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విభజన అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సద్దుమణగడం లేదు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరు మీద తెలంగాణ ప్రభుత్వం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించవద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్ట్‌లు ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయని సుప్రీంకు సమర్పించిన కౌంటర్‌ పిటీషన్లో పేర్కొంది. కృష్ణానదిలో 45 […]

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రేగిన జల వివాదాలు..!
Follow us on

ఏపీ-తెలంగాణ మధ్య విభజన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విభజన అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సద్దుమణగడం లేదు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరు మీద తెలంగాణ ప్రభుత్వం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించవద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్ట్‌లు ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయని సుప్రీంకు సమర్పించిన కౌంటర్‌ పిటీషన్లో పేర్కొంది. కృష్ణానదిలో 45 టీఎంసీలపై తమకే హక్కుందని తెలంగాణ అనడం కోర్టును తప్పుదారి పట్టించడమే అవుతుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే.. పట్టిసీమ ద్వారా నీరు తరలిస్తున్నందున..కృష్ణానది నీటి వాటా మొత్తం తమకే చెందుతుందన్న తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే పట్టిసీమ ద్వారా తరలిస్తున్నామని ఏపీ సర్కార్‌ వాదిస్తోంది.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కార్‌ తీరుపై మండిపడుతోంది. లక్ష ఎకరాలకు సాగునీరందించే అతి పెద్ద ప్రాజెక్ట్‌కుగా ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తే ఏపీ ప్రభుత్వం మోకాలొడ్డుతోందని ఆరోపిస్తోంది.