Watch Video: రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ చేసిన నిర్వాకానికి షాక్ అయిన జనం..

వైరల్‌గా మారిన ఈ వీడియోలో రద్దీగా ఉండే రహదారి మధ్యలో జేసీబీని నిలిపి ఉంచడం కనిపిస్తుంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఎంతసేపటికి కూడా రోడ్డుపై నుంచి జేసీబీ కదలకపోవడంతో కొందరు ముందుకు వచ్చి డ్రైవర్‌ ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ వ్యక్తి జేసీబీపైకి ఎక్కి చూడగా డ్రైవర్

Watch Video: రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ చేసిన నిర్వాకానికి షాక్ అయిన జనం..
Jcb Viral Video
Follow us

|

Updated on: Apr 25, 2024 | 9:00 PM

ఇలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నవ్వకుండా ఉండడం ఎవరి తరం కాదు.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు చూసి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు దానిపై లైట్ కామెంట్స్ చేస్తుంటే కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వైరల్ వీడియోలో ఒక JCB రోడ్డు మధ్యలో పార్క్ చేసి ఉండగా, అందులో డ్రైవర్ హాయిగా నిద్రపోతున్నాడు. దాంతో ఆ రోడ్డు మొత్తం ట్రాఫిక్‌ జామ్‌తో అస్తవ్యస్థంగా మారింది. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటూనే, సదరు జేసీబీ డ్రైవర్‌పై మండిపడుతున్నారు.

వైరల్‌గా మారిన ఈ వీడియోలో రద్దీగా ఉండే రహదారి మధ్యలో జేసీబీని నిలిపి ఉంచడం కనిపిస్తుంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఎంతసేపటికి కూడా రోడ్డుపై నుంచి జేసీబీ కదలకపోవడంతో కొందరు ముందుకు వచ్చి డ్రైవర్‌ ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ వ్యక్తి జేసీబీపైకి ఎక్కి చూడగా డ్రైవర్ హాయిగా గుర్రుపెట్టి నిద్రిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తి జేసీబీ డ్రైవర్‌ను నిద్రలేపి రోడ్డు మధ్యలో ఉన్న జేసీబీని తొలగించాలని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. అయితే, వీడియో ఎక్కడ నుండి, ఎప్పుడు అనేదానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తెలియలేదు.

JCB driver sleeping in the middle of busy road byu/22_January_2024 inCarsIndia

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను చూసిన పలువురు సోషల్ మీడియా యూజర్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి జేసీబీ రోడ్డుపై నిలపడమే పెను ప్రమాదానికి కారణమని జనాలు అంటుండగా, ఈ వీడియోపై కొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. అతను ఓవర్ టైం పని చేయకూడదనుకుంటున్నాడని ఒకరు రాశారు. సమయం ముగిసిన చోట జేసీబీ ఆపేశాడనుకుంటా..! అని ఒక వినియోగదారు అంటుండగా, బహుశా అతను తాగి ఉన్నాడని మరొకరు రాశాడు. ఇలా మార్గమధ్యలో జేసీబీని పార్క్ చేసి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాడని, చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాడని మరొకరు రాశారు. అటువంటి పరిస్థితిలో, పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ పలువురు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles