Mosquito Tornado: ఆ దేశంలో దోమల సుడిగాలి.. వీడియో హల్ చల్.. ఇది మరో విపత్తుకు సంకేతం అంటున్న నెటిజన్లు

|

Jul 20, 2021 | 4:47 PM

Mosquito Tornado: సుడిగాలి అనగానే తుఫాన్ సమయంలో ఏర్పడేవి గుర్తుకొస్తాయి.. అవును ఎక్కువగా సుడిగాలులు సూపర్ సెల్ తుఫానుల సమయంలో ఏర్పడుతుంటాయి. అయితే ఈ సుడిగాలులు..

Mosquito Tornado: ఆ దేశంలో దోమల సుడిగాలి.. వీడియో హల్ చల్.. ఇది మరో విపత్తుకు సంకేతం అంటున్న నెటిజన్లు
Mosquito Tornado
Follow us on

Mosquito Tornado: సుడిగాలి అనగానే తుఫాన్ సమయంలో ఏర్పడేవి గుర్తుకొస్తాయి.. అవును ఎక్కువగా సుడిగాలులు సూపర్ సెల్ తుఫానుల సమయంలో ఏర్పడుతుంటాయి. అయితే ఈ సుడిగాలులు అన్నీ ఒకేలా కనిపించినప్పటికీ వివిధ రకాల సుడిగాలులున్నాయి. కొన్నిటిని టొర్నడోలు అని కూడా పిలుస్తారు. అయితే ఈ టోర్నడోలు.. దోమలతో ఏర్పడినవి కూడా కావొచ్చు.. అవును గతంలో అర్జంటేనియా గగనతలంలో ఏర్పడిన దోమల దండు సుడిగాలి.. మళ్ళీ కనిపించింది. అయితే ఈసారి రష్యాలో ఈ దృశ్యం కనిపించింది. మబ్బుల తరహాలో దట్టంగా జట్టుకట్టి సుడిగాలిలా దూసుకొస్తూ.. సూర్యుడిని సైతం కమ్మేసింది.. ఈ దోమల దండు.. ఈ నెల 17న రష్యాలో కనిపించిన ఈ ఘటన గురించి వివరాల్లోకి వెళ్తే.

రష్యాలోని కమ్చట్కా క్రాయ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఎదురుగా సుడిగాలి కనిపించింది. ఇప్పడు ఎప్పుడు ఎక్కడ ఏ వింత కనిపించినా వెంటనే సెల్ కు పని చెప్పడం వీడియో తీయడం అలవాటైన నేపథ్యంలో అతని వెంటనే ఆ దృశ్యాన్ని చిత్రీకరించడం మొదలు పెట్టాడు.. అలా వీడియో తీస్తూ సుడిగాలి దగ్గరగా వెళ్లిన ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. ఎందుకంటే అది అసలు సుడిగాలి కాదు. దోమల దండు.. వెంటనే ఈ విషయం తెలుపుతూ ఆ వీడియో సోషల్ మీడియా లో షేర్ చేశాడు..

వీడియో చుసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండు దోమలు ఉంటేనే.. ఆమ్మో దోమలా అంటాము.. ఇక దోమ కుట్టగానే విలవిలాడిపోతూ.. దానిని చంపేయడానికి ప్రయత్నిస్తాం.. మరి అలాంటిది.. ఏకంగా ఇన్ని వందల దోమలు ఒక్కచోటనే ఉన్నాయి.. అవికనుక ఒక్కసారిగా మనిషి మీద వాలి రక్తం పీల్చీస్తే.. ఇక మనిషి బతికితే అవకాశం ఉందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది ఈ దోమలు హాని చేయవని అంటే.. మరికొందరు సుడిగాలి లా దోమలు ఎగురుతున్నాయంటే.. త్వరలో ప్లేగు వ్యాధి వస్తుంది అనడానికి ముందస్తు హెచ్చరికలు అంటున్నారు. ఎందుకైనా మంచిది..ఇటువంటి దోమల దండుకు దూరంగా ఉంటేనే మంచిదని కొందరు సూచిస్తున్నారు. నిజానికి మగ దోమకు బద్దకమని.. అవి వేడి రక్తం ఉన్న మనుషులను, జంతువులను కుట్టవని .. ఆడ దోమలు మాత్రమే కుడతాయని అంటున్నారు. ఇక మగ దోమలు.. ఆడ దోమలతో కలిసేందుకు అలా గుంపులుగా వస్తున్నాయని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దోమల సుడిగాలి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కలు కొడుతోంది.

 

 

Also Read:Arati Puvvu Curry Recipe: కోనసీమ స్టైల్‌లో రుచికరమైన అరటిపువ్వు కూర తయారీ విధానం..