మెరుపులు మెరిపించిన వార్నర్, సాహా.. ఢిల్లీ టార్గెట్ 220

Hyderabad Scored 219 Runs :  ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ మెరుపులు మెరిపించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు హైదరాబాద్ సారథి డేవిడ్‌ వార్నర్ ‌(66/ 34 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు), వృద్ధిమాన్‌ సాహా(87/ 45 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు) దుమ్ము రేపారు. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. చివర్లో వచ్చిన మనీశ్‌ పాండే కూడా మెరుపులు మెరిపిండంతో స్కోరు బోర్డు పరుగులు […]

  • Sanjay Kasula
  • Publish Date - 10:01 pm, Tue, 27 October 20
మెరుపులు మెరిపించిన వార్నర్, సాహా.. ఢిల్లీ టార్గెట్ 220

Hyderabad Scored 219 Runs :  ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ మెరుపులు మెరిపించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు హైదరాబాద్ సారథి డేవిడ్‌ వార్నర్ ‌(66/ 34 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు), వృద్ధిమాన్‌ సాహా(87/ 45 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు) దుమ్ము రేపారు. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది.

చివర్లో వచ్చిన మనీశ్‌ పాండే కూడా మెరుపులు మెరిపిండంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం కూాడా విశేషం. ఢిల్లీ స్పీడ్‌స్టర్‌ రబాడ 4 ఓవర్లు వేసి వికెట్‌ తీయకుండా 54 పరుగులు సమర్పించుకున్నాడు. నోర్ట్జే, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు. ఆఖర్లో విలియమ్సన్‌ (11 నాటౌట్‌: 10 బంతుల్లో 1ఫోర్) భారీ షాట్లు ఆడలేకపోయాడు. హైదరాబాద్ కెప్టెన్ వార్నర్‌ మంగళవారం తన 34వ పుట్టినరోజును జరుపుకున్నాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు వార్నర్‌, సాహా ధనాధన్‌ ఆరంభాన్నిచ్చారు. తాను ఫామ్‌లో ఉంటే ఎంత ప్రమాదమో వార్నర్‌ మరోసారి నిరూపించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు 52 చేసిన ఆటగాడిగా వార్నర్‌ నిలిచాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన వార్నర్‌..25 బంతుల్లోనే 6ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా రబాడ వేసిన ఆరో ఓవర్లో వార్నర్‌ నాలుగు ఫోర్లు, సిక్సర్‌ బాది 22 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా వేగంగా ఆడుతుండటంతో పవర్‌ప్లే ఆఖరికి 77 పరుగులు చేసింది. వార్నర్‌ తన సహజమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు.