అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న టైమ్‌ మ్యాగజైన్‌ సరికొత్త ప్రయోగం!

| Edited By: Anil kumar poka

Oct 28, 2020 | 11:35 AM

ప్రపంచంలో ఏ పత్రికైనా పరిస్థితులను బట్టి మాస్టర్‌హెడ్‌ను పైకి కిందికి జరుపుకుంటుందే తప్ప మొత్తం పేరే మార్చదు.. అలా మార్చుకోడానికి ఇష్టపడవు.. న్యూస్‌ వీక్‌ అయితే న్యూస్‌వీక్‌ అన్న పేరుతోనే వస్తుందే తప్ప వేరే పేరుతో రాదు..

అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న టైమ్‌ మ్యాగజైన్‌ సరికొత్త ప్రయోగం!
Follow us on

ప్రపంచంలో ఏ పత్రికైనా పరిస్థితులను బట్టి మాస్టర్‌హెడ్‌ను పైకి కిందికి జరుపుకుంటుందే తప్ప మొత్తం పేరే మార్చదు.. అలా మార్చుకోడానికి ఇష్టపడవు.. న్యూస్‌ వీక్‌ అయితే న్యూస్‌వీక్‌ అన్న పేరుతోనే వస్తుందే తప్ప వేరే పేరుతో రాదు.. కానీ టైమ్‌ అనే వార పత్రిక ఓ సరికొత్త ప్రయోగం చేసి పాఠకులను అమితంగా ఆకట్టుకుంటోంది.. మార్కెట్‌లో ఉన్న నవంబర్‌ రెండు పత్రికను చూడండి.. టైమ్‌ అని ఉండదు.. 97 ఏళ్ల చరిత్రలో ఇలా టైమ్‌ అనే పేరుతో రాని ప్రత్యేక సంచిక ఇదే! ఇలాంటి ప్రయోగం ఇంతకు ముందు ఎవరూ చేయలేదు.. ఇక ముందు చేస్తారేమో తెలియదు.. టైమ్‌లోని ఐఎమ్‌ అనే మధ్య అక్షరాలను తొలగించి, మొదట ఉన్న టీని చివర ఉన్న ఈ ముందుకు జరిపి, ఎడమవైపున వీవో అన్న అక్షరాలను పెట్టారు.. మొత్తం మీద ఓట్‌ అనే పేరుతో తాజా సంచికను విడుదల చేశారు.. అమెరికాకు ఈ అధ్యక్ష ఎన్నికలు ఎంత కీలకమైనవో ముఖచిత్రం ద్వారానే చెప్పేసింది టైమ్‌ మ్యాగజైన్‌! కవర్‌పేజిలో ఓ మహిళ కర్చీఫ్‌ను మాస్క్‌లా పెట్టుకుని ఉంది.. కర్చీఫ్‌పై బ్యాలెట్‌ బాక్స్‌ను, బాక్స్‌ను కాపాడుతున్నట్టుగా రెండు అరచేతులు, ఇనుప సంకెళ్లు, ఇంకా కొన్ని మార్మిక చిత్రాలు ఉన్నాయి.. ఈ కవర్‌పేజీని డిజైన్‌ చేసింది ప్రముఖ చిత్రకారుడు ఫ్రాంక్‌ షెఫర్డ్‌..