‘హస్తానికే మీ ఓటు’, అరెరె ! సింధియా పొరబాటు, తడబాటు !

| Edited By: Pardhasaradhi Peri

Nov 01, 2020 | 5:51 PM

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం పెద్ద ‘పొరబాటే’ చేశారు. దాబ్రాలో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవికి మద్దతుగా ప్రచారం చేస్తూ ఆయన, కమలం గుర్తుకే మీ ఓటు అనబోయి.. పొరబాటున ‘హస్తానికే ‘ మీ ఓటు అనేశారు. కాంగ్రెస్ ఎన్నికల చిహ్నమైన హస్తం గుర్తుకే మీరు బటన్ నొక్కండి అన్నారు. అయితే వెంటనే ఆయన పొరబాటును సరిదిద్దుకున్నా ఇమ్రతీ దేవితో బాటు బీజేపీ కార్యకర్తలు, ఓటర్లు కూడా […]

హస్తానికే మీ ఓటు, అరెరె ! సింధియా పొరబాటు, తడబాటు !
Follow us on

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం పెద్ద ‘పొరబాటే’ చేశారు. దాబ్రాలో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవికి మద్దతుగా ప్రచారం చేస్తూ ఆయన, కమలం గుర్తుకే మీ ఓటు అనబోయి.. పొరబాటున ‘హస్తానికే ‘ మీ ఓటు అనేశారు. కాంగ్రెస్ ఎన్నికల చిహ్నమైన హస్తం గుర్తుకే మీరు బటన్ నొక్కండి అన్నారు. అయితే వెంటనే ఆయన పొరబాటును సరిదిద్దుకున్నా ఇమ్రతీ దేవితో బాటు బీజేపీ కార్యకర్తలు, ఓటర్లు కూడా అయోమయంలో చిక్కుకున్నారు. ఓల్డ్ హాబిట్స్ డై హార్డ్ అని ఊరికే అన్నారా ? (కాంగ్రెస్ నేత కమల్ నాథ్…. ఈ బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించే ‘ఐటెం’ అని వివాదాస్పద వ్యాఖ్య చేశారు.