SCO Summit: పాకిస్తాన్ ప్రధాని అవస్థలు.. పుతిన్ ముసిముసి నవ్వులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

పాకిస్తాన్ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ముప్పుతిప్పలు పడ్డారు. ఆయన అవస్థలు చూసి పుతిన్‌ ముసిముసిగా నవ్వుకొన్నారు. పుతిన్ మాట్లాడటం ప్రారంభించగానే షరీఫ్ చెవి నుంచి మరోసారి ఇయర్ ఫోన్ పడిపోయింది.

SCO Summit: పాకిస్తాన్ ప్రధాని అవస్థలు.. పుతిన్ ముసిముసి నవ్వులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Pak Pm Struggles

Updated on: Sep 16, 2022 | 12:45 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ముప్పుతిప్పలు పడ్డారు. ఆయన అవస్థలు చూసి పుతిన్‌ ముసిముసిగా నవ్వుకొన్నారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా ఇద్దరు నేతలు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చలు మరికాసేపట్లో మొదలవుతున్నాయనగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు దేశాల ప్రతినిధులు చర్చల కోసం రెడీగా కూర్చున్నారు. ఓ వైపు ముందుగానే పుతిన్‌ ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని రెడీగా ఉన్నారు. అయితే పాక్ ప్రధాని షహబాజ్‌ మాత్రం ఆ పరికరాన్ని పెట్టుకునేందుకు అవస్థలు పడ్డారు.

ఆ  ఎవరైనా సాయం చేయండి అని ఆయన సిబ్బందిని పిలిచారు. ఆయన సహాయకుడు వచ్చి ట్రాన్స్‌లేటర్ ఇయర్‌ఫోన్‌  అమర్చి వెళ్లిపోయారు. అయితే, పుతిన్ మాట్లాడటం ప్రారంభించగానే షరీఫ్ చెవి నుంచి మరోసారి ఇయర్ ఫోన్ పడిపోయింది. రష్యా అధ్యక్షుడి ముందు పాక్ ప్రధాని ఇబ్బంది పడుతుండగా పుతిన్ నవ్వుతూ కనిపించారు. అతని ఇయర్‌ఫోన్‌ను ఒక అధికారి రెండవసారి సరి చేశారు.

ఈ వీడియోను పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పుతిన్ మాట్లాడుతున్నప్పుడు అనువాద సాధనానికి ఇయర్‌ఫోన్‌లను సర్దుబాటు చేయడంలో షెహబాజ్ షరీఫ్ విఫలమయ్యారని ఎద్దేవ చేస్తూ చూపించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం