మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్ రేసులో భారతీయ ఆటగాళ్లు
మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్‌కు టీమిండియా సారథి విరాట్ కోహ్లి నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం మొత్తం ఏడుగు ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. అందులో కోహ్లితోపాటు ఇండియన్ స్పిన్నర్...
మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారత క్రికెటర్లకు నిలిచారు. మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డ్‌కు టీమిండియా సారథి విరాట్ కోహ్లి నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం మొత్తం ఏడుగు ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. అందులో కోహ్లితోపాటు ఇండియన్ స్పిన్నర్ అశ్విన్ కూడా దూకుడు మీదున్నాడు. ఈ ఇద్దరు కాకుండా జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ , ఏబీ డివిలియర్స్ , కుమార సంగక్కర ఉన్నారు.
కోహ్లి ఇదొక్కటే కాకుండా మొత్తం ఐదు అవార్డుల రేసులో ఉన్నాడు. దశాబ్దపు అత్యుత్తమ వన్డే ప్లేయర్‌కు కూడా విరాట్ నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం ధోనీ, రోహిత్ శర్మ, లసిత్ మలింగ, మిచెల్ స్టార్క్, డివిలియర్స్, సంగక్కర కూడా పోటీ పడుతున్నారు.
ఇక దశాబ్దపు అత్యుత్తమ టీ20 ప్లేయర్ అవార్డు కోసం కూడా కోహ్లి, రోహిత్ నామినేట్ అయ్యారు. ఈ లిస్ట్‌లో రషీద్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్, ఆరోన్ ఫించ్, మలింగ, క్రిస్ గేల్ ఉన్నారు. ఇవే కాకుండా మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్, ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు రేసులోనూ కోహ్లి ఉన్నారు. కోహ్లియే కాకుండా ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కోసం ధోనీ కూడా పోటీ పడుతున్నాడు.