AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL VIDEO : టీకా భయంతో చిన్న పిల్లలా అరుస్తున్న మహిళ..! తిట్టిపోస్తున్న జనాలు.. వైరల్ వీడియో..

VIRAL VIDEO : కోవిడ్ -19 టీకా డ్రైవ్ భారతదేశం అంతటా పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ కొంతమంది ఇంకా టీకా గురించి సందేహం వ్యక్తం

VIRAL VIDEO : టీకా భయంతో చిన్న పిల్లలా అరుస్తున్న మహిళ..! తిట్టిపోస్తున్న జనాలు.. వైరల్ వీడియో..
Viral Video
uppula Raju
|

Updated on: Jul 12, 2021 | 12:29 PM

Share

VIRAL VIDEO : కోవిడ్ -19 టీకా డ్రైవ్ భారతదేశం అంతటా పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ కొంతమంది ఇంకా టీకా గురించి సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది సూది ఫోబియాతో కూడా వేసుకోవడం లేదు. ఇంజెక్షన్ తీసుకోవటానికి భయపడుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఒక మహిళ చిన్న పిల్లలా అరిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోలో ఒక మహిళ ఆరెంజ్ కలర్ చీర ధరించి టీకా కేంద్రంలో కూర్చుని కనిపిస్తుంది. వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే ఆమె ముఖం మారుతుంది. టీకా వేయడంతో చాలా నొప్పి ఉన్నట్లు పిల్లలలా మాదిరి బిగ్గరగా అరుస్తూ ఉంటుంది. దీంతో అందరు షాక్ అవుతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలా మంది చిన్న పిల్లలా అరుస్తూ, భయపడినందుకు ఆమెను ఎగతాళి చేస్తున్నారు. చిన్న టీకా వేసుకుంటే అంత నొప్పి వచ్చిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె అతి చేస్తుందని విమర్శించారు.

అయినప్పటికీ సూదులు, ఇంజెక్షన్లంటే చాలామందికి భయం ఉంటుంది. దీనిని ట్రిపనోఫోబియా అని పిలుస్తారు. కొన్ని రోజుల క్రితం ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. టీకా కేంద్రంలో కుర్చీపై కూర్చున్న ఒక పెట్రిఫైడ్ మహిళను ఇద్దరు వ్యక్తులు, గట్టిగా పట్టుకుంటారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి నర్సు ఆమెను సమీపించేటప్పుడు ఆమె పెద్దగా ఏడుస్తూ అందరిని కలవరపాటుకు గురిచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కరోనాను అధిగమించాలంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. ప్రభుత్వం కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది.

Brushing Mistakes : బ్రష్ చేసేటప్పుడు చాలామంది ఈ తప్పులు చేస్తారు..! ఇది మీ దంతాలు, చిగుళ్లను ప్రభావితం చేస్తుందని తెలుసా..?

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈరోజు, రేపు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

Kadaknath Chicken : కడక్‌నాథ్ చికెన్‌కు విదేశాలలో కూడా డిమాండ్..! లాభసాటి వ్యాపారానికి ప్రభుత్వ సహకారం..