విద్యుత్ అధికారులను ఇలా కట్టేశారు..

|

Jul 18, 2020 | 5:57 PM

మెదక్ జిల్లా జనం తిరగబడ్డడారు.  విద్యుత్తు అధికారులను నిర్బంధించారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలోకి  బిల్లుల వసూళ్లకు వచ్చిన విద్యుత్తు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామంలో కరెంట్‌ సమస్యలను పరిష్కరించకుండా ఊళ్లోకి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా వచ్చిన అధికారులను గ్రామ మధ్యలోకి లాక్కుపోయారు.  అక్కడే ఉన్న ఓ కరెంట్ పిల్లర్ కు తాడుతో కట్టి పడేశారు. గ్రామంలో కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు వచ్చేవరకు ఒదిలేది లేదంటూ […]

విద్యుత్ అధికారులను ఇలా కట్టేశారు..
Follow us on

మెదక్ జిల్లా జనం తిరగబడ్డడారు.  విద్యుత్తు అధికారులను నిర్బంధించారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలోకి  బిల్లుల వసూళ్లకు వచ్చిన విద్యుత్తు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామంలో కరెంట్‌ సమస్యలను పరిష్కరించకుండా ఊళ్లోకి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడితో ఆగకుండా వచ్చిన అధికారులను గ్రామ మధ్యలోకి లాక్కుపోయారు.  అక్కడే ఉన్న ఓ కరెంట్ పిల్లర్ కు తాడుతో కట్టి పడేశారు. గ్రామంలో కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు వచ్చేవరకు ఒదిలేది లేదంటూ తీర్మానం చేశారు. నిర్భందించిన విషయం తెలుసుకున్న అధికారులు వారిని విడిపిచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ గ్రామంలో నెలకొన్న కరెంట్ సమస్యలపై ఫోకస్ పెట్టారు.