బయట తిర‌గొద్ద‌న్నందుకు దాడి…వాలంటీరు మృతి

లాక్‌డౌన్‌ సమయంలో ఏపీలో గ్రామ వాలంటీర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. కరోనా బాధితుల‌ను ఐడెంటిఫై చెయ్య‌డం..వ్యాధి వ్యాప్తిని క‌ట్టడి చెయ్య‌డంలో వీరు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో బయటికి రావొద్దని హెచ్చ‌రించినందుకు ఏకంగా గ్రామ‌ వాలంటీరుపై దాడి చేసిన ఘటన కందిరివలసలో చోటుచేసుకుంది. బాధితుడు ట్రీట్మెంట్ పొందుతూ చ‌నిపోవ‌డంతో వారం తరువాత విష‌యం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పనుకువలస పంచాయతీ కందిరివలస గ్రామ వాలంటీరు కోన లక్ష్మణరావు (23) ఈ నెల 18న […]

బయట తిర‌గొద్ద‌న్నందుకు దాడి...వాలంటీరు మృతి

Updated on: Apr 29, 2020 | 1:46 PM

లాక్‌డౌన్‌ సమయంలో ఏపీలో గ్రామ వాలంటీర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. కరోనా బాధితుల‌ను ఐడెంటిఫై చెయ్య‌డం..వ్యాధి వ్యాప్తిని క‌ట్టడి చెయ్య‌డంలో వీరు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో బయటికి రావొద్దని హెచ్చ‌రించినందుకు ఏకంగా గ్రామ‌ వాలంటీరుపై దాడి చేసిన ఘటన కందిరివలసలో చోటుచేసుకుంది. బాధితుడు ట్రీట్మెంట్ పొందుతూ చ‌నిపోవ‌డంతో వారం తరువాత విష‌యం వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పనుకువలస పంచాయతీ కందిరివలస గ్రామ వాలంటీరు కోన లక్ష్మణరావు (23) ఈ నెల 18న కోవిడ్-19 గురించి ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నాడు. ఎవరూ బయటకు రాకూడదని సూచించాడు. ఈ క్ర‌మంలో రోడ్డుపై తిరుగుతున్న గాదిపల్లి చిన్నారావును ఇంట్లోకి వెళ్లాలని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఈ నెల 20న ఒంటరిగా ఉన్న లక్ష్మణరావుపై చిన్నారావు, అతని తండ్రి సన్యాసి, సోదరుడు రామకృష్ణ దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. బాధితుడిని తల్లిదండ్రులు సాలూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. లక్ష్మణరావు ఈ నెల 26న పాచిపెంట పోలీసులకు కంప్లైంట్ చెయ్య‌గా..కేసు నమోదు చేశారు. లక్ష్మణరావు ప‌రిస్థితి విష‌మించ‌డంతో జిల్లా కేంద్రాసుపత్రికి, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు సీఐ ఎస్‌.సింహాద్రినాయుడు తెలిపారు.